పుట:Tatwamula vivaramu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాలుచేయు ఆరు చెడు గుణములు గలవు. అట్లే పుణ్యములను అంటగట్టి సుఖములందు ముంచు ఆరు మంచి గుణములు గలవు. పుణ్యమును తగిలించు మంచి గుణములను మిత్రులుగ లెక్కించినపుడు పాపములను తగిలించి కష్టముల పాలుచేయు చెడు గుణములను శత్రువులుగ లెక్కించ వలసియున్నది. 1) కామ 2) క్రోధ 3) లోభ 4) మోహ 5) మధ 6) మత్సరమను ఆరు గుణములు మన శరీరములోనే శత్రుపాత్ర వహించుచున్నవి. ఇవి జీవుని పాలిట భీకరమైన బలమైన శత్రువులు. ఈ ఆర్గురు శత్రువులను జయించవలెనంటే జీవునికి జ్ఞానము అవసరము. లోకములో జ్ఞానమను కత్తుల చేతనే గుణములనబడు శత్రువులను జయించవచ్చును. అందువలన ఈ తత్త్వములో "ఆగర్భశత్రువులు ఆర్గురిని చంపే విధము తెలియని మాకు తేజమైన కత్తులనిమ్మని కోరితివిూ" అని ఒక జిజ్ఞాసి అడిగినట్లు గలదు.


 2) ఐదు పడగల పాము విషముతో బాధపడే మాకూ
బోధామృతమనే మందిమ్మని కోరితివిూ || శ్రీ గురు ||

భూమి మీద ఎక్కడైన ఒక పాముకు ఒక తలమాత్రముండును. కాని మన శరీరములో మనస్సు అను పాముకు ఐదు తలలు గలవు. ఒక్కో తలలో ఒక్కో విధమైన విషయమున్నది. మనస్సు ఒకటే అయిన అది జీవునికి అందించు విషయములు ఐదు రకములుగ ఉన్నవి. మనస్సుకు గల ఐదు తలలు వరుసగ 1) కన్ను 2) చెవు 3) ముక్కు 4) నాలుక 5) చర్మము. శరీరములోని ఈ ఐదు ఇంద్రియములు ఐదు రకముల విషయములను జీవునికి అందించుచున్నవి. ఈ ఐదు విషయములతో జీవుడు ఆహర్నిశలు విలవిలలాడి పోవుచున్నాడు. విషమునకు ఏ మనిషైన బాధపడక తప్పదు. అలాగే మనిషిలోని ఐదు