పుట:Tatwamula vivaramu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 1) ఆగర్భశత్రువుల ఆర్గురిని చంపేవిధమూ తెలియని మాకూ
తేజమైన కత్తుల నిమ్మని కోరితివిూ || శ్రీ గురు ||

 2) ఐదు పడగల పాము విషముతో బాధపడే మాకూ
బోధామృతమనే మందిమ్మని కోరితివిూ || శ్రీ గురు ||

 3) ఏడు కొండలు ఎక్కే మార్గము తెలియని మాకూ
   కంటకములు లేని మార్గము తెలుపమని కోరితివిూ || శ్రీ గురు ||

 4) అండ పిండ బ్రహ్మండము తెలియని మాకూ
      అంతా నిండియుండే వానిని తెలుపమని కోరితివిూ || శ్రీ గురు ||

 5) పుట్టలోని పామును బట్టే విధము తెలియని మాకూ
      పామును పట్టే కట్టుమంత్రము తెలుపమని కోరితివిూ || శ్రీ గురు ||


వివరము : పరమాత్మ సాకార ఆకారమైన భగవంతుడే నిజమైన గురువు. అతనే జగద్గురువు. జగత్తుకంతటికి వర్తించు బోధ తెలియజేయువాడు కనుక ఆయనను జగద్గురువు అంటున్నాము. శరీరములో నివశించు జీవునికి శరీరములో నివశించక పరమాత్మలో కలిసిపోవు జ్ఞానమును తెలుపు గురువు యొక్క పాదములకు నమస్కరించుచు మోక్షము పొందు జ్ఞానమును తెలుపమని కోరుచు ఒకరు "శ్రీగురు చరణారవిందములు నమ్మి కొలుతుము అనుదినమూ, ఇదేరీతిగ అదే బోధగ అనుదినము కోరితిమి" అన్నారు.


 1) ఆగర్భశత్రువుల ఆర్గురిని చంపేవిధమూ తెలియని మాకూ
  తేజమైన కత్తుల నిమ్మని కోరితివిూ || శ్రీ గురు ||

పుట్టుకతోనే మొదలైన శత్రుత్వమును ఆగర్భశత్రుత్వము అంటాము. మొదటినుండి ఉన్న శత్రువును ఆగర్భశత్రువు అంటాము. మన పుట్టుకతోనే మన శరీరములోనే మనలను పాపములలో ముంచి కష్టముల