పుట:Tatwamula vivaramu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వాయువులన్నియు బంధింపబడుచున్నవి. కావున ఇంటిలోని అందరిని మ్రింగెను అని చెప్పబడి ఉన్నది. శ్వాస కుంభించిన తర్వాత ఊపిరితిత్తులు ఖాళీవల్ల రెండు లేక మూడుసార్లు కొద్దికొద్దిగా బయటి గాలి లోపలికి ప్రవేశించి, ప్రవేశించిన గాలి తిరిగి బయటికి రాక నిలుచుటవలన చూడవచ్చిన జనులనెల్ల చూచి మ్రింగెను అని చెప్పబడి ఉన్నది.


3) కాళ్లు చేతులు లేనివాడు కడవ ముంత చేత పట్టి నిండుబావి నీళ్లని ఒక్కడే ముంచెను " ఆహా "

శ్వాసకు రూపములేదు కావున కాళ్లు చేతులు లేనివాడని చెప్పబడినది. శ్వాస ముక్కురంధ్రములలో ఒక దానియందు ఎక్కువ ఒక దానియందు తక్కువ లోపలికి బయటికి చలించుచున్నది, ఎక్కువ శ్వాసను కడవ అని, తక్కువ శ్వాసను ముంతని చెప్పడమైనది. కావున కడవ ముంత చేతపట్టి అని చెప్పడమైనది. శరీరములోని తలంపులన్ని శ్వాస ఒక్కటి నిలువడము వల్ల నిలిచిపోవుచున్నవి. కావున బావినీళ్లన్ని ఒక్కడేముంచెను అని చెప్పబడి ఉన్నది. శరీరమును బావిగా పోల్చడమైనది.


4)ఏటివిూద స్వాతికొంగ వేటలాడుచురాగ చాటునున్న విూనుపిల్ల అట్టే మ్రింగె " ఆహా "

శ్వాస శరీరములో నిలిచిపోయిన దాని వలన మనస్సు నిలచి పోవుచున్నది. మనస్సు నిలచిపోవుట వలన ఊపిరితిత్తులు తర్వాత నరములు, ఆ తర్వాత సూర్యచంద్రనాడులు, షట్‌ చక్రములు ఒక దాని తర్వాత ఒకటి తమతమ చైతన్యమును కోల్పోవుచున్నవి. కావున ఏటి