పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రేకు: 0039-05 శ్రీరాగం సంపుటము: 01-241
పల్లవి: అంగడి నెవ్వరు నంటకురో యీ -
       దొంగలఁ గూడిన ద్రోహులను
చ. దోసము దోసము తొలరో శ్రీహరి -
    దాసానదాసుల దగ్గరక
    ఆసలనాసల హరినెఱఁగక చెడి
    వీసర పోయిన వెఱులను
చ. పాపము పాపము పాయరో కర్మపుఁ
    దాపపువారము దగ్గరక
    చేపట్టి వేదపు శ్రీహరికథలు
    యేపొద్దు వినని హీనులము
చ. పంకము పంకము పైకొనిరాకురో
    కొరింకుఁగోరెసరులకూళలము
    వేంకటగిరిపై విభునిపుణ్యకథ
    లంకెల వినని యన్యులము
రేకు:0092-02 శంకరాభరణం సంపుటము: 01-454
పల్లవి: అంగనలాల మనచే నాడించుకొనెఁగాని
       సంగతెఱిఁగిన నెరజాణం డితఁడే
చ. వొడలులేనివాని కొక్కఁడే తండ్రాయంగాని
    తడయక పురుషాత్తముఁ డితఁడే
    బడబాగ్ని జలధికిఁ బాయకల్లుఁడాయఁగాని
    వెడలించె నమృతము విష్ణుఁ డితడే
చ. పులిగూడుదిన్న వానిపొం దొక్కటే సేసేఁగాని
    నలువంక లక్షీనాథుఁడితఁడే
    చలికిఁ గోవరివానిసరుస బావాయఁగాని
    పలుదేవతలకెల్ల ప్రాణబంధుఁ డితఁడే
చ. యొక్కడో గొల్లసతుల కింటిమగఁడాయఁగాని
    తక్కక వెదకే పరతత్వ మితఁడే
    మిక్కిలి శ్రీవేంకటాద్రిమీఁద మమ్ము నేలెఁగాని
    తక్కక వేదము చెప్పే దైవమీతఁడే
రేకు:0099-04 దేసాక్షిసంపుటము: 01-498
పల్లవి: అంచితపుణ్యులకైతే హరి దైవ మవుఁగాక
       పంచమహపాతకులభ్రమ వాప వశమా
చ. కాననియజ్ఞానులకు కర్మమే దైవము
       ఆనినబదులకు దేహమే దైవము
       మాపననికాముకులకు మగువలే దైవము
       పానిపట్టి వారివారిభ్రమ మాన్పవశమా
చ. యేమీ నెఱఁగనివారి కింద్రియములు దైవము
      దోమటిసంసారి కూరదోర దైవము
      తామసుల కెల్లాను ధనమే దైవము
      పామరుల బట్టినట్టి భ్రమఁ బాపవశమా
చ. ధర నహంకారులకు తాఁదానే దైవము
     దరిద్రుఁడైనవారికి దాత దైవము
     యిరవై మాకు శ్రీవేంకటేశుడే దైవము
     పరులమంచినయట్టి భ్రమఁ బాపవశవమా