పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/740

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

738 మెల్లనే నీడలు నిండె మించి సుజ్ఞానమున చ. పరమయోగములఁ బూఁపలుఁ బిందెలు వుట్టె పరగె సురలనే పందిటియందు యిరవై శ్రీవేంకటేశుఁడిందుకు ఫలమైనాఁడు గురుసేవలను దొరకును వివేకులకు రేకు:0262-05 దేవగాంధారి సంపుటము: 03-359 పల్లవి: పంటల భాగ్యులు వీరా బహు వ్యవసాయులు అంటిముట్టి యిట్లఁ గాపాడుదురు ఘనులు చ. పొత్తుల పాపమనేటి పోడు నఱకివేసి చిత్తమనియెడు చేను చేనుగా దున్ని మత్తిలి శాంతమనే మంచివాన వదనున విత్తుదురు హరిభక్తి వివేకులు చ. కామక్రోధాదులనే కలువు దవ్వివేసి వేమరు వైరాగ్యమనే వెలుఁగు వెట్టి దోమటి నాచారవిధుల యెరువులువేసి వోముచున్నారు జ్ఞానపుఁ బై రుద్యోగజనులు చ. యెందు చూచిన శ్రీవేంకటేశుఁడున్నాడనియెడి అందిన చేని పంట లనుభవించి సందడించి తమవంటి శరణాగతులుఁ దాము గొంది నిముడుకొందురు గురుకృప జనులు రేకు:0045–02 మలహరి సంపుటము: 01-274 పల్లవి: పండియుఁ బండదు చిత్తము పరిభవ యెడయదు కాంక్షల యెండలనే కాఁగితి మిఁక నేలాగోకాని చ. పదిగోట్లుజన్మంబులఁ బాయనికర్మపుఁ బాట్లు వదలక వొక నిమిషములో వడిఁదీరుచు నితఁడు చెదరని నిజదాసులకును శ్రీహరి, మా కిప్పడంతక హృదయము నిలువదు చంచల మేలాగోకాని AAAAAA AAAA AAAA AAAA AAAA AAAA AAAA AAAA AAAA SAAA AAAA AAAA AAASA SAAAAA AAAA AAAA SAAA ee