పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/728

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

726 వగచినా వగవక వ్రతము చెఱిచే మంటే మొగమోడకున్నవాఁడే ముక్తికి నరుఁడు చ. విఱిచినా విఱుగక విష్ణుభక్తి యెడాటాస వెఱపించినా మఱివెఱవకా నెఱవై శ్రీవేంకటేశ నీ పాదములే నమ్మి మొఱఁగు లేనివాఁడే ముక్తికి నరుఁడు పె.అ.రేకు:0076-06 సామంత సంపుటము: 15-440 పల్లవి: నే నే భాగ్యవంతుఁడను నీ కృప గలిగె నాకు జ్ఞాన మిచ్చితివి నే సంసారము సేయఁగాను చ. వుట్టదరిద్రుఁడై వున్నప్పుడు వచ్చిన సంపద లట్టే వేపచేదు దాగెయప్పటి తీపు దట్టమై యాకలిగొన్నతఱిఁగల యాహారము గట్టిగాఁ జవియైనట్టు గలిగె నీ భక్తి చ. చిక్కులేక భీతివాసినమీది సంతోషము నిక్కపు రోగము మానిన సౌఖ్యము మిక్కలి యప్పలు దీని మెఱనే దొరతనము గక్కన నా కబ్బినట్టు గలిగె నీ భక్తి చ. జడిసి యెండదాఁకిని సమయమందలి నీడ అడవిలోపల సహాయమైన తోడు అడరి దొరకినట్టు లట్టే శ్రీవేంకటేశ కడఁగి నీ కృపవల్లఁ గలిగె నీ భక్తి రేకు: 0309-05 గుండక్రియ సంపుటము: 04-053 పల్లవి: నే నేమి సేయుదును నిన్నుఁ బో వివేకము శ్రీనాథుమహిమలు చిమ్మి రేఁచఁగాను చ. జీవుఁడేమి సేయును; చిత్తము వసముగాక యీవల నావలఁ బరువెత్తఁ గాను చేవల నాచిత్తమేమి సేయు; నందులోన నున్నశ్రీవల్లభభునిమాయ చిమ్మిరేఁచఁగాను చ. దేహ మేమిసేయును ; దేహము లోపల నున్న దాహపుటాసలు వెట్టి దవ్వఁగాను యీహల నాయాసలును యేమిసేయు ; నన్నిటికి శ్రీహరి యానాజ్ఞ లిటు చిమ్మిరేఁచఁగాను చ. పుట్టు గేమిసేయును ; పురాకృతము వెంటఁ గట్టిన బంధములై కలఁచఁగాను గుట్టుతో శ్రీవేంకటేశుఁ గొలువఁగా నన్నతఁడు మట్టుమిరఁ బదవిచ్చి మన్నించఁగాను రేకు:0093-01 గుండక్రియ సంపుటము: 01-459 పల్లవి: నే నేమి సేయుదును నీవు నాలోపలనుండి శ్రీనాథుడవు నీచేఁత లింతేకాక చ. తనువేమిసేయును తనువులోపలనున్నచెనఁటియింద్రియములచేఁతఁలుగాక మనసేమిసేయును మనసులోపలనున్ననినుపుఁగోర్కులు చేసే నేరములుగాక చ. జీవుఁడేమి సేయును జీవునిఁ బొదుగుకున్న భావపుప్రకృతి చేసేపాపముగాక