పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/727

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

725 వెగటున నాన దోసి వెఱపుమాలినవాఁడు అగపడి యాజ్ఞ వెట్టు మంటే మానవలెను చ. ధన మెత్తుకొన్నవాఁడు తానే వచ్చి పనివేళ ననిమొన నిల్చితేఁ జేకొనవలెను వనరి యజ్ఞానపువాఁడ నిన్ను నుతించితి ఘనుఁడ శ్రీ వేంకటేశ కావవలె నన్నును రేకు: 0362-05 ఆహిరి సంపుటము: 04-367 పల్లవి: నే నవగుణి నైన నీకుఁ బోదు భువి లోన భక్తవత్సలుఁడ వటు గాన చ. పరమ పురుషా భవరోగ వైద్య ధరణీధర మాధవ కేశవా అలిది సంసారాన నలసిత్రి నినుఁగను - తెరు వేదొ వెర వేదొ తెలియ నే నిపుడు చ. భువనాతీతా పుండరీకేక్షణ నవనీతప్రియ నారసింహా యివల నాయపరాధ మెంతైనఁ గలదు నా వివరము చింత్రించి వెసC గామరాదా చ. అగుణాసగుణా యాద్యంతరహితా అగణిత శ్రీ వేంకటాద్రినాథ నిగమగోచర నేను నీయూధీనము నింతే నగుఁబాటు గాకుండ ననుఁగావుమిపుడు పె.అ.రేకు:0048-06 కన్నడగౌళ సంపుటము: 15-274 పల్లవి: నేనెంత నీచుఁడనైనా నీకుఁ బోవునా తానకమై నాలోనుండి తప్పించుకోవచ్చునా చ. సేసవెట్టి పెండ్లాడిన చెలి యేరూపుది యైనా వాసితోఁ బతికి విడువఁగ వచ్చునా కాసుకుఁ గొచ్చినయట్టి కడుఁ బేదబంటు నైనా వోసరించి వొకరికి నొప్పగించ వచ్చునా చ. చేరి తనవాకిలి గాచే శునకమున కైనా వూర కాహారము వెట్టకుండ వచ్చునా ఆరయఁ దాఁగన్నబిడ్డ అంకె కెంత రాకుండినా కూరిమి జేకొనక తాఁ గోపగించ వచ్చునా చ. పెంచినచిలుక యెంత పేరు కుచ్చి తిట్టినాను ముంచి ముద్దాడుట గాక మొత్త వచ్చునా నించి శ్రీవేంకటేశుఁడ నీ దాసులందు నేరమి యించుక గలిగినా మన్నించకుండ వచ్చునా పె.అ.రేకు:0071-03 బౌళి సంపుటము: 15-408 పల్లవి: నేనెంతవాఁడను నిన్ను నడిగే నంటే వీనుల నీ కత లెల్లా వినుటే కాకా చ. అడిగిన నలుగక యన్యులు మఱి తూరఁ బలికినాను మారువలుకకా కలఁచినఁ గలఁగక కసరికొట్టినాను ములుగనివాఁడు గదా ముక్తికి నరుఁడు చ. నగిననుఁ దా నగక నాతు లెవ్వరైనాఁ దగిలి పెనఁగినాఁ దగులకా