పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/617

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

615 చ. కొలువ నావసమా గుఱుతెఱిఁగి నీవెంట చెలఁగి నాచేతులఁ బూజించ వసమా నిలిచి శ్రీవేంకటేశ నీవే నాయదలో నుండి మలసి పెరరేఁపుచు మన్నించేవు గాక రేకు:0080-01 ఆహిరి సంపుటము: 01-382 పల్లవి: దేవ నీమాయతిమిర మెట్టిదో నా భావము చూచి గొబ్బనఁ గానవే చ. వెడదు:ఖమపుడెల్లా వేరుచుండుదుఁగాని తడవి విరతిఁబొంది తలఁగలేను ఆడియూసలఁ బిలిగి అలుయుచుండుదుఁగాని మడి దొసకుల నివి మానలేను చ. హేయము స్త్రీసుఖమని యెఱుఁగుచుండుదుఁగాని పాయపు మదముచేతఁ బాయలేను పాయునిపాపాలు చూచి భయుముందుచుందుఁగాని వోయయ్య యివి సేయకుండలేను చ. కలకాల మిన్నియును గందు విందుఁగాని మఱి యెలమి నొక్కటనైన యెచ్చరలేను బలిమి శ్రీవేంకటేశ బంధముక్తునిఁజేసి తలఁపులో నెలకొని దయఁజూడవయ్యా రేకు:0078-03 బౌళి సంపుటము: 01-372 పల్లవి: దేవ నీవిచ్చేయందుకు దీనికిఁగా నింతయేల యేవేళ మాయెరుకలు యెందుకుఁ గొలువును చ. యెవ్వరివసములు బుద్దెరిఁగినడచేమన యివ్వల నారాయణ నీవియ్యక లేదు దవ్వు చేరువ మనసు తనయిచ్చయితేఁ గనక రవ్వగ మృగాదులెల్ల రాజ్యమేలనేరవా చ. సారేకు నిన్నుఁదలపించ జంతువులవసమా కేరి నీవు జిహ్వఁ బరికించఁగాఁగాక యీరీతి లోకమెల్లాఁ దమయిచ్చకొలఁదులనయితే దూరానఁ గొక్కెరలు చదవవా వేదాలు చ. యిందరిపాపపుణ్యాలు యిన్నియు నీచేఁతలే కుందవ స్వతంత్రులు గారు గాన చందపు శ్రీవేంకటేశ శరణంటి నిదె నీకు చెంది నీవే కాతుగాక చేఁతలూను వలెనా రేకు:0164-02 ముఖారి సంపుటము:02-307 పల్లవి: దేవ నీవు గల్పించిన తెరువు లివి నీవారైన వారి నేరుపులివి చ. పరమశాOతునకుఁ జూపము రాదు విరతిగలవానికి వెరపు లేదు గురుసేవారతునకుఁ గోపము రాదు ధర సత్యవిదునకుఁ దప్పు లేదు చ. పుట్టు బ్రహ్మచారికి బుద్ధి చెడదు అట్టె ఆసలేనివారికి అలపు లేదు తొట్టిన సుజ్ఞానికి దుఃఖములేదు గట్టియైన మౌనికి కలహమే లేదు