పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/612

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

610 చ. సారిది సంతలలోని సుద్దులెల్ల విని విని విరసములెల్లఁ బాపే విభుఁడెవ్వఁడో తిరువేంకటగిరి దేవుఁడై యిందరికిఁ గరుణ లోకము గాచే ఘనుఁడెవ్వఁడో రేకు:0356-02 ముఖారి సంపుటము: 04–328 పల్లవి: దిక్కులేనివారు నీవే దిక్కని కొలువఁగా అక్కరకితఁడు దైవమందురువో నిన్నును చ. పాలుపడి నిన్నుఁజేరి పట్టి కొలిచినవారి జాలిపాటు తొలఁగించి జడను వాపి మూలఁబడనీక తెచ్చి ముదుసేసికావఁగాను మేలెరుఁగుబుధులెల్ల మెత్తురువో నిన్నును చ. కొండలుఁ గోట్లునైన కోరికలు గలవారి - యండనే కోరికలిచ్చి యాదరించగా నిండినదాసులకెల్ల నీవే దైవ మవని కొండమీఁదనుండినఁ బైకొందురువో నిన్నును చ. యేకమైనమనసుతో నెవ్వరు దలచినాను చేకొని కరుణఁ గృపసేయఁగాను యేకాలము శ్రీవేంకటేశుఁడు మాదైవమని లోకమెల్లఁ దామే కొలుతురువో నిన్నును రేకు: 0322-06 సామంతం సంపుటము: 04-129 పల్లవి: దినమట రాతిరట తీరుచున్నదా కవగూడఁ బాయఁ గాక కాణాచి వున్నదా చ. మానుష జన్మమట మలమూత్రదేహమట సాశీనల హేయమేకాక శుద్ధి వున్నదా మానని కోరికలట మాయల సంసారమట దీనవృత్తేకాక యిందుఁ దేజమున్నదా చ. చంచలపుఁ జిత్తమట సకలేంద్రియములట పొంచిన పాపమేకాక పుణ్యమున్నదా సంచితపుఁ గర్మమట జనన లయములట ముంచిన తీదీ పేకాక మోదమున్నదా చ. శ్రీవేంకటేశుఁడట జీవుఁడనేనట యిందు దైవపుదాస్యమే కాకితరమున్నదా Oుూవల నావలన టు Oుహముఁ బరమునట కైవశము లాయఁగాక కడమున్నదా రేకు:0136-04 శ్రీరాగం సంపుటము: 02-151 పల్లవి: దినము ద్వాదశి నేఁడు తీర్థదివసము నీకు జనకుఁడ అన్నమాచార్యుఁడ విచ్చేయవే చ. అనంతగరుడ ముఖ్యులైన సూరిజనులతో ఘన నారదాది భాగవతులతో దనుజమర్దనుఁడైన దైవశిఖామణితోడ వెనుకొని యారగించ విచ్చేయవే చ. వైకుంఠాన నుండి యాళువారలలోపల నుండి లోకపు నిత్యముక్తులలోన నుండి శ్రీకాంతతోడనున్న శ్రీవేంకటేశుఁ గూడి యీకడ నారగించ నింటికి విచ్చేయవే