పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/598

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

596 కైవల్యమొసఁగుఘననిధి, విధికిమపూవిధి, జడులకు యూదవకులుఁడు చ. ఆద్యుఁడచలుఁడు మహభూత మితఁడ భేధ్యుఁడ సాధ్యుఁడు భీకరుఁడు సద్యఃఫలదుఁడు సకలమునులకును వేద్యుఁడితఁడె పో వేంకటవిభుఁడు రేకు:0141-02 బౌళి సంపుటము: 02-179 పల్లవి: తెలిసినమాటలు నీసముఖంబున దీకొని ని న్నడుగకపోదు సులభుఁడ వన్నిట ప్రాణనాథుఁడవు చొప్పుగ నానతి యియ్యఁ గదే చ. నీవే బలవంతుఁడవో నీకంటేఁ గర్మము బలువో కైవసముగ నే నెంచిచూచితే కర్మముకంటె బలువుఁడవు భూవలయంబుల ప్రారబ్దంబులు భోగించవలెనని యంటివా ವ೦808) ನಿಬ್ಧತೆ నీదేవత్వమునకు వెలితిగదే చ. ఐనాఁగాని లోకములోపల నది నీ యాజ్ఞని తలఁచితిమా నేను నీశరణుచొచ్చిన మీఁదట నీవే పరిహరించఁగవలదా కానిపించు నాకిఁక నొకబుద్ధి కర్మముపై నెప మటువేసి పూనుచుఁ గాలక్షేపంబునకై భువిని వినోదము గాఁబోలు చ. యెందాఁకా జీవులతోడుత నీ వేలాటంబులు జరపెదవు అందరికిని నీవే తలిదండ్రివి అయి రక్షింపుచునున్నాఁడవు కందువ దెలిసెను శ్రీవేంకటేశ్వర కర్త వెట్టు చేసిన మేలు చందమాయ నిది దగవె నీకును సంతోషించితి మిటు నేము రేకు:0108-04 రామక్రియ సంపుటము: 02-046 పల్లవి: తెలిసినవాఁడాఁ గాను తెలియనివాఁడాఁ గాను యిల నొకమాట నీ కెత్తిచ్చితిఁగాని చ. పుట్టించేవాఁడవు నీవే బుద్ధిచ్చేవాఁడవు నీవే యెట్టున్నానపరాధా లేవి మాకు అటూ నన్నవారముగా మనఁగా నీచిత్తమెట్లో కిట్టి వొకమాట మడిగితి నింతేకాని చ. మనసులోపల నీవే మరి వెలుపల నీవే యొనసి అపరాధాలు యేవి మాకు నిను నౌఁగాదనలేము నీ సరివారముఁ గాము అనవలసినమాట అంటి మింతే కాని చ. అంతరాత్మవును నీవే అన్నిటాఁ గావఁగ నీవే యెంతైనా నపరాధా లేవి మాకు వింత లేక శ్రీవేంకటవిభుఁడ నీబంట నింతే వంతుకు నేనొకమాట వాకుచ్చితిఁగాని రేకు:0295-05 లలిత సంపుటము: 03-552 పల్లవి: తెలిసినవారి కింతా దేవుఁడై యుండు కలఁడన్నచోట హరి గలఁ డటుగాన చ. అందునిందుఁ బోయి శ్రీహరిని వెదకనేల బొందితోడి రూపులెల్లాఁ బొలి నతఁడే కొందరిలోనుండి ఇచ్చుఁగోరినట్టి యీవులెల్ల కొందరిలో మాటలాడుఁ గొందరిలో నగును చ. లోన వెలిఁ జూచి పరలోకము వెదకనేల యేనెలవైన వైకుంఠ మెదుట నదె