పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/596

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

594 పన్నిన ముదిమియుఁ బైపైఁ గొన్నాళ్లు వున్నతి నంతట నుడుగుట కలది చ. జంతువులకు యీసరవులు నీవే పొంతలఁ గల్పించి పొదిపితివి యింతట శ్రీవేంకటేశ్వర నీకృప చింతించి కావవే చేకొని నన్ను పె.అ.రేకు: 0049-04 గుండక్రియ సంపుటము: 15-278 పల్లవి: తెలిసి చూచినవేళ దేవుఁ డొక్కఁడే నిలిచి నలువంక రక్షించఁగ నవ్వీనీ జీవుఁడు చ. నెలవై తండ్రితొడపై నిద్రవోయేటి బాలుఁడు కలలోనఁ బులిఁ గని కడు మొఱవెట్టినట్టు లలరి హరి యాధారమై యుండఁగ మాయఁ జిక్కి బలుసంసారబాధను భ్రమసీని జీవుఁడు చ. తటుకున రాజుఁగొల్చి దండనుండే మనుజుఁడు ఆట యింద్రజాలము చూచి యంబుధి యీఁదినట్టు ఘటన హరి తనకు కర్తయై యుండఁగాను కుటిలపుట జ్ఞానానఁ గుందీని జీవుఁడు చ. దరిద్రుఁడైనవాఁడు తక్కక కన్నులు మూసి నిరుపమాంజనముచే నిధానము గన్నయట్టు యిరవై శ్రీవేంకటేశు డిట్టే కరుణించఁగాను యెరవులేని భక్తిచే నీడేరీ జీవుఁడు పె.అ.రేకు:0009-03 గుజ్జరి సంపుటము: 15-052 పల్లవి: తెలిసి బదుకరో దేహూలాల వలెనని తలఁచినవారివాఁడే దేవుఁడు చ. తనుఁ గొలువకూడితే తారము వెట్టఁ డేలిక పెనఁగి కొలువకున్నఁ బెట్టు దేవుఁడు జనుగుచు విడుతురు చుట్టాలు దరిద్రులెత్రే వెనువెంటా నెంతయినా విడువఁడు దేవుఁడూ చ. అంతట ముదిసితేను అంగనలు రోతురు అంతరాత్మ యెన్నఁడు రోయఁడు దేవుఁడు వింతగా నన్నఁ దమ్ములు విసాన కలుగుదురు పొంతనే తా నలుగుఁడు పుట్టించిన దేవుఁడు చ. వొదిగి మూల నుండితే వూరివారు మఱతురు వదల కెందున్నా మఱవఁడు దేవుఁడు తుదిముట్ట రక్షించు దుఃఖము లెల్ల నణఁచు యెదుట శ్రీవేంకటేశుఁడితఁడె పాశీదేవుఁడు రేకు:0104-01 పాడి సంపుటము:02-019 పల్లవి: తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బదుకు ఘనునికిని చ. అనయము సుఖమేడ దవల దుఃఖమేడది తనువుపై నాసలేని తత్త్యమతికి పొనిఁగితేఁ బాపమేది పుణ్యమేది కర్మమందు వొనర ఫలమొల్లని యోగికిని చ. తగిన యమృతమేది తలఁపఁగ విషమేది తెగి నిరాహారియైన ధీరునికిని