పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/588

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

586 వెరపు చెప్పెడివారు వేరీ రేకు: 0192-06 గుండక్రియ సంపుటము: 02-473 పల్లవి: తానే తెలియుఁ గాక తలఁచఁగ నెట్టవచ్చు నానాగతుల తన నాటకపు మూయ చ. అట్టె యేఁబదియైన యక్షరాలలోనట తిట్టులట వొకకొన్ని దీవెనలటా మట్టుతో వేదములట మంత్రములట కొన్ని యిట్టివి చిక్కులు భూమి నిఁకనెన్ని గలవో చ. కదిసిన యeువదిగడియలలోనట పొదలు నడకలట భోగములటా నిదురట వొకకొంత నేరుపులు కొన్నియట యెదుట చూడఁగఁ జూడ నిఁక నెన్ని గలవో చ. రేవగలు కన్నులివి రెంటిలోనేయుట దైవము జీవులలోనే తానకమట శ్రీవేంకటాద్రిమీఁద జెలఁగి యూగెనా?)తఁడే యుట యేవంక నీచేఁతలు యిఁక నెన్నిగలవో చి.ఆ.రేకు:0009-02 పాడి సంపుటము: 10-050 పల్లవి: తానేడ వారేడ తనువేడ మరి తక్కినవెల్లానేడ మానలే ననుచు తరితీపు సేసే మన సేడ నుండునో చ. కందువ మానిపై నోరూరించెటికాయలుఁ బండ్లు పక్వముదప్పిన అందముగ మున్ను గోరినట్టివారి యాసలెందుండునో పొందున వలచి పులకించినట్టిపురుషులు సతు లట్టె ముదిసి తె ముందర వెనక నెరఁగనియ్యనిమోహ మెందుండునో చ. కొత్తమెరుఁగులచేత భ్రమయించే కోకలు చివిరె పాఁతగిలితె బత్తితోఁ గావలె నని కొన్నవారిభ్రమ లెందుండునో రిత్తజవ్వనాన కొప్పుగోళ్ల దిద్ది రీతిగానుండెటి సింగారంబులు పత్తివలెనై బట్టగట్టఁదనభావ మెందుండునో చ. తావితో బుగులుకొనెటివూవులు దాఁపఁగ నవియొ వాడినపిమ్మట భావించి చూచితే నందలి తొల్లిటిపస యెందుండునో శ్రీవెంకటనాథుండిట్టె యేలెఁగాకచెల్లఁ బోతాఁదొల్లి భోగించినవెల్ల వేవేగ మరునాఁ డవియె చూడ నేవిధమైయుండునో రేకు:0015-06 లలిత సంపుటము: 01-094 పల్లవి: తాప లేక మేడ లెక్కఁదలఁచేము యేపులేని చిత్తముతో యీహీహీ నేము చ. ఎఱుకమాలినబుద్ధి యెవ్వరైనాఁ బతులంటా తెఱఁగెఱఁగక వీధిఁ దిరిగేము పఱచైన జవరాలు పరులెల్లా మగలంటా వొఱపు నిలిపిన ట్లో హోహో నేము చ. యిందరును హితులంటా యెందైనా సుఖమంటా పొందలేని బాధఁ బొరలేము