పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/535

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

533 కనకాచలముతో గక్కన సరివచ్చె చ. గరుడవేగాన శ్రీవేంకటేశు రథము వచ్చె మరగిన యల మేలుమంగసిరితో ధరలోన వీధులేఁగి తన నెలవుకు వచ్చె పరగ హరిదాసుల పంతములు వచ్చె రేకు: 0328-02 లలిత సంపుటము: 04-161 పల్లవి: చూడవమ్మ కృష్ణుఁడు నీ సుతుఁడోయమ్మ ఆడీ వీధుల వెంట యశోదమ్మా చ. కోలలు చాచీ వుట్లు గొట్టఁగా బాలుఁ బెరుగు కాలువలు గట్టి పారెఁ గదవమ్మా మేలములాడీ వద్దంటే మిక్కిలి గొల్లెతలతో ఆలకించి వినవమ్మ యశోదమ్మా చ. చక్కిలాల కుండలెల్లా చలాన దొండ్లు వొడిచి దిక్కన దోఁటికోలలఁదీసీనమ్మా చిక్కని తేనె చాడే చివ్వన రాత వేసితే అక్కడ జోరునఁ గారె యశోదమ్మా చ. అల్లంత నుండి తన కందరాని తెంకాయలు వల్లె తాళ్ళు వేసి వంచీనమ్మా బల్లిదుఁడలమేల్మంగపతి శ్రీవేంకటేశుఁడు అల్లిబిల్లె యున్నాఁడమ్మ యశోదమ్మా రేకు:0239-03 దేవగాంధారి సంపుటము: 03-224 పల్లవి: చూడవే గోవింద సోద్యము లిన్నియు యేడాఁ గర్తపు యిన్నిట నాకు చ. చీరినఁ దునుఁగక చేసిన దురితము నారవలెనే కడు నారటిలీ కారుకొని తలఁపు కలఁకగుణంబుల వారక పెనునదివలెం బాలీని చ. యెఱ్ఱఁగాఁ గ్రూరత్వమెప్పుడుఁ గొలిమిలో కఱువలెనే కడుఁగాఁగీని వొట్టియై ప్రకృతి వొరసి వేఁటలో యిట్టివలెనే యెలయించీని చ. వీడక నీమూర్తి వెంటవెంటనే తోడునీడయై తొరలీని యీడనే శ్రీవేంకటేశ నీ మహిమ వాడని వనములవలెఁ జిగిరించీని రేకు:0019-05 భైరవి సంపుటము: 01-117 పల్లవి: చూడుఁడిందరికి సులభుఁడు హరి తోడు నీడయగు దొరముని యితఁడు చ. కైవల్యమునకుఁ గనకపు తాపలత్రోవై శ్రుతులకుఁ దుదిపదమై పావనమొక రూపమై విరజకు నావై యున్నాఁడిదె యితఁడు చ. కాపాడఁగ లోకములకు సుజ్ఞాన దీపమై జగతికిఁ దేజమై పాపాలడ(పఁగ భవపయూధులకు