పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/534

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

532 కలిగిన విదివో కాలంబెల్లా చ. తగిలేటి పురుషులు తమకపు కాంతలు బగి వాయనిదీ బదుకెల్లా అగపడి శ్రీవేంకటాధిప నీ కృపఁ దెగని జీవనము దినదిన మెల్లా రేకు:0022-03 వరాళి సంపుటము: 01-133 పల్లవి: చూడఁజూడ మాణిక్యాలు చుక్కలవలె నున్నవి యీడులేని కన్నులవె యిన చంద్రులు చ. కంటిఁగంటి వాఁడెవాఁడె ఘనమైన ముత్యాల కంటమాలలవే పదకములు నవె మింటి పొడవైనట్టి మించుఁ గిరీటంబదే జంటల వెలుఁగు శంఖచక్రా లవె చ. మొక్కుమొక్కు వాఁడెవాఁడె ముందరనే వున్నాఁడు చెక్కులవే నగవుతో జిగిమో మదె పుక్కిట లోకములవె భుజకీర్తులును నవె చక్కనమ్మ అలమేలు జవరాలదే చ. ముంగైమురాలును నవె మొలకఠారును నదె బంగారు నిగులవన్నె పచ్చబట్టదే యింగితమెరిఁగి వేంకటేశుఁడిదె కన్నులకు ముంగిటి నిధానమైన మూలభూతమదె రేకు:0016-02 బౌళి సంపుటము: 01-096 పల్లవి: చూడరెవ్వరు దీనిసాద్యంబు పరికించి చూడఁజూడఁగఁ గాని సుఖుమెఱఁగరాదు చ. ఎడతెగని మమత వేయఁగరాని పెనుమోపు కడలేని యాస చీఁకటి దవ్వుకొనుట నిడివైన కనుచూపు నీడనుండిన యెండ వడిచెడని తమకంబు వట్టితాపంబు చ. బుద్ధిమానిన చింత పాశీనియూరికిఁ దెరువు పొదువోవని వలపు పొట్టపొంకంబు యెదుఁ బట్టిన సివం బెఱుకమాలిన ప్రియము లొద్దిక విహారంబు లుబ్బుఁగవణంబు చ. తీపులోపలి తీపు తిరువేంకటేశ్వరుని చూపు దనుఁ బొడగనని చూపు లోచూపు , ఆపదలువాయు నెయ్యపుఁ దలఁపులీతలఁపు రూపైన రుచిలోని రుచి వివేకంబు రేకు:0289-01 సాళంగనాట సంపుటము: 03-512 పల్లవి: చూడరో చూడరో నేఁడు సురలార నరులార దాడివోయి దనుజుల దండించి తా వచ్చె చ. వాయు వేగమున వచ్చె వనజాక్షు నరదము వేయిసూర్యుల ప్రతాపవిభవముతో చాయల చక్రవాళాద్రి సముద్రాలు దాఁటి వచ్చె ఆయితమై పైఁడిటెక్కే లవే కానవచ్చె చ. మునుకొని మనో వేగమున వచ్చె హరితేరు తనరారు కోటిచంద్రప్రభలతో వెనుకొని దిక్కులెల్లా విజయము సేసి వచ్చె