పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/483

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

481 ఆదిమధ్యాంతరహితాధికాయ భేదాయ పునరప్యభేదాయ నమో నమో నాదప్రియాయ మమ నాథాయ తస్మె చ. పరమపురుషాయ భవబంధహరణాయ నమో నిరుపమానందాయ నిత్యాయ దురితదూరాయ కలిదోషవిధ్వస్తాయ హరియచ్యుతాయ మమ ఆత్మాయ తస్మై చ. కాలాత్మకాయ నిజకరుణాకరాయ నమో శ్రీలలామాకుచాశ్రితగుణాయ హేలాంక శ్రీవేంకటేశాయ నమో నమో పాలితాఖిల మమాభరణాయ తస్మె రేకు: 0030-06 రామక్రియ సంపుటము:01-187 పల్లవి: కుడుచుఁగాక తనకొలఁదిగాని మేలు దడవీనా నోరు తగినంమెంతయును చ. చంపవచ్చిన కర్మసంగ్రహంబగు బుద్ది గంప గమ్మక తన్ను గాచీనా పంపుడుదయ్యమై బాధఁ బెట్టెడుయాస కొంపలోన నుండనీఁగోరీనా చ. శ్రీవేంకటగిరి శ్రీనాధుఁ డిందరిఁ గావంబ్రోవఁగ నున్నఘనుఁడు దేవోత్తముని నాత్మఁ దెలియ కితరములయినత్రోవ లెన్నిన మేలు దొరకీనా చి.ఆ.రేకు:0004-01 లలిత సంపుటము: 10-019 పల్లవి: కుడువనికుడుపులు కొనసాగె మమతలు కడువేగ శ్రీహరిఁ గానఁగవలదా చ. నమలక చవులయ్య నాతుల సుదులు అమర చింత్రకాయలవంటివి భ్రమసి కొరుకఁబోతె పండ్లు వులుసును తెమలక శ్రీహరిఁ దెలియఁగ వలదా చ. విచ్చక మెరుఁగులు విడివడ్డ వలపులు పచ్చి మేడిపంటి భావమువి మెచ్చి లోను చూడ మొదలుపురువులె గచ్చుల యివి మాని కనవద్దా హరిని చ. బడలని పంట వో పైపైనే హరిభక్తి కడలేని కల్పవృక్షమువంటిది కడఁగి కొలువ శ్రీవెంకటనాధుఁడె గురి బడినె యినాతనిఁ గని బ్రదుకఁగ వలదా రేకు:0374-02 గుజ్జరి సంపుటము:04–433 పల్లవి: కూడుదు రూరకె వొకచో గుమి విత్తురు వేరొకచో యేడకో తెరువులు నడతురు యేఁటిదో హరిమాయ