పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/433

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

431 సేసవెట్టిన చేతుల చెఱఁగువట్టి తీసేవు ఆ సుద్దులే చెప్పేను ప్రహ్లాదవరదా చ. నంటునఁ దొడమీఁదను నలినాక్షి నెక్కించుక అంటేవు సిగ్గులు ప్రహ్లాదవరదా గెంటక యేపొద్దును కేలుగేలుఁగీలించుక అంటువాయ వదివో ప్రపదవరదా చ. కందువతోఁ గాఁగిలించి కైవసము సేసుకొంటి - నందముగ నీకెను ప్రపదవరదా పొంది శ్రీవేంకటమున పొంచి యాభళములోనా అంది వరాలిచ్చేవు ప్రహ్లాదవరదా రేకు: 0304-05 మంగళకౌశిక సంపుటము: 04-023 పల్లవి: ఔలే నే నొకపనికి నవుదు నీకును కూళలలో నెంచి చూడ గురి యవుదును చ. పసురము వంటివాఁడ పాపపు బందెలు దెత్తు శిసువు వంటివాఁడ సిగ్గు నెగ్గు నెరఁగ వసుధలో రాయి వంటివాఁడను దయదలఁచ యెసఁగ నన్నేరీతి నీ వేలితివి దైవమా చ. మాఁకువంటివాఁడ నే మతి లేదు; పుచ్చినపోఁక వంటివాఁడ నెప్పుడు కొరగాను రోఁకలి వంటివాఁడ రోటిలోనిపోట్లకు యేఁకట నన్నెటువలె నేలితివి దైవమా చ. పామువంటివాఁడనే పట్టినవారిఁ గరతు గామువంటివాఁడ లోకమువారిఁ జీడింతు నేమపు శ్రీవేంకటేశ నీవు నన్ను బంటంటానేమిటికిఁ గృపతోడ నేలితివి దైవమా రేకు:0104-03 మలహరి సంపుటము: 02-021 పల్లవి: కంచూఁగాదు పెంచూఁగాదు కడుఁబెలుచు మనసు యెంచరాదు పంచరాదు యెట్టిదో యీమనసు చ. పట్టఁ బసలేదు చూడ బయలుగాదీమనసు నెట్టనఁ బారుచునుండు నీరూఁగాదీమనసు చుట్టిచుట్టి పాయకుండుఁ జుట్టమూఁగాదీమనసు యెట్టనెదుటనే వుండు నేఁటిదో యీమనసు చ. రుచు లెల్లాఁ గానుపించు రూపు లేదు మనసు పచరించు నాసలెల్లాఁ బసిఁడి గాదీమనసు Cయోచటా( గరఁగదు రాయినా ( గాదు మనసు యిచటా నచటాఁ దానే యేఁటిదో యీమనసు చ. తప్పక నాలోనుండు దైవముఁ గాదు మనసు కప్పిమూఁటగరాట్టదు గాలీఁగాదు మనసు చెప్పరానిమహిమలశ్రీవేంకటేశుఁ దలంచి యిప్పడిన్నిటా గెలిచె నేఁటిదో యీమనసు రేకు: 9084-03 దేశాక్షి సంపుటము: 04-589 పల్లవి: కంటి నఖిలాండ కర్త నధికుని గంటి కంటి నఘములు వీడుకొంటి – నిజమూర్తిఁ గంటి చ. మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి బహువిభవముల మంటపములు గంటి