పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

415 భువి నింద్రియములతోఁ బుట్టే నీతనువు అవల నిశ్చలబుద్ధి అది యేడ నే నేడ భవము చంచలమనసు పంగెమే యెపుడు చ. యెలమిఁ గర్మవిముక్తి యేడ నే నేడ తెలియంగఁ గర్మాధీన మీబ్రదుకు కుళకమగు సాత్మికపుగుణ మేడ నే నేడ కలియుగం బిది యిందుఁ గలవాఁడ నేను చ. తనివోని ఘనోరతప మేడ నే నేడ అనిశంబు నీకు శరణాగతుఁడను యెనలేని శ్రీవేంకటేశ్వరుఁడ నీబిరుదు కనుఁగోరినఁగ శరణాగత్రపాలిజాత్రం పె.అ.రేకు:0016-02 లలిత సంపుటము: 15-088 పల్లవి: ఏవుపాయములు యొక్కడి కెక్కసు శ్రీ వల్లభ నీసేవే ఘనము చ. చదివిన బుదులు శాస్త్రపు యుక్తులే వెదకును జ్ఞానము వెదకను తుదఁబుణ్యవిధులు దొడ్డపుణ్యములే యెదుగాఁ జేయించు యెనయదు విరతి చ. చెవిలోన కతలు చెప్పినంతవడె త్రవిలి జ్ఞానము దా(టదు భువి శివములు వుబ్బులంబరవశములె భవహరమగు నీ భక్తికిఁ జొరదు చ. నరసురుల సేవ నామధారికమే దురిత హరంబై తూరదు యిరవగు శ్రీ వేంకటేశ్వర నీవే కరుణించి మముఁ గాత్రువు గాక చి.ఆ.రేకు:0005-03 నారాయణదేసాక్షిసంపుటము: 10-027 పల్లవి: ఐన దేది కాని దందులో నేది నానారూపి శ్రీనాథుఁడె కాకా చ. యెవ్వరి దూషించే మెవ్వరి భూషించే మెవ్వరు స్వతంత్రు లిందులో అవ్వల నివ్వల నంతరాత్ముఁడైన యవ్వనజాక్షుని ననుట గాకా చ. యెందుకుఁ గోపించే మెందుకు మెచ్చే మెందుఁ గద్దు మే లిందులో అందు నిందుఁ దానె యల్లుకొన్న నందనందనునే నమ్మట గాకా చ. యేచోటు మంచిది యేచోటు చెడ్డది యేచోటు సతమౌ నిందులో కాచేటి శ్రీవెంకటనాధుఁడె చేచేతఁగాణాచై చెల్లించెఁ గాకా రేకు:0153-02 కాంబోది సంపుటము: 02-247 పల్లవి: ఐనట్టయ్యిఁ గాక హరికల్పితము లివి మూనేటి వేఁటివో మానని వేవో చ. వొక్కరు తలఁచినట్టు వొకరి తలఁపు రాదు