పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

407 నీవే గతెన్నవారికి నిఖిల రక్షకుఁడవు వావిరి శరణువేఁడేవారి భాగ్యరాశివి చ. నిన్నుఁ బూజించేవారి నిజపరతత్త్యమవు ఇన్నిటా నీదాసులకు నేలికెవు యెన్నఁగ శ్రీవేంకటేశ యిహపరములకును పన్ని కాచుకున్నవారి ఫలదాయకుఁడవు రేకు: 0031–02 ముఖారి సంపుటము: 01-189 పల్లవి: ఏల పొరలేవులేవే యింతలోనిపనికి మాలయింటితోలుకప్పమాయ లిటువంటివి చ. చిక్కులతమకముల చీఁకటిగప్పిననాఁడు యొక్కువ వాసనలౌ హేయపు మేను వెక్కసపు ప్రియమది విరిగితే రోఁతలౌ లక్కపూఁతకపురు లీలాగు లిటువంటివి చ. మించినచిత్తములో మేలుగలిగిననాఁడు యెంచరానిచవులౌ నెంగలిమోవి పెంచుకంటే కష్టమౌ ప్రియముదీరిననాఁడు చంచలపు చిత్తములచంద మిటువంటిది చ. వెల్లి గొనుసురతపు వేళ మరపులయింపు కొల్లలాడుటె కొనగోరితాఁకులు నల్లితిండె మరి మీఁద మరగితే రోఁతలౌ వుల్లమిచ్చే వేంకటేశువొద్ది కిటువంటిది రేకు:0135-04 రామక్రియ సంపుటము: 02-145 పల్లవి: ఏల మమ్ము గాసిసేసే రింకా మీరు కాలముతో నిలిచేను కైవల్యపదవి చ. పాపములు హరినామపఠనచేఁ బాపుకొంటి కైపుగఁ జిత్రగుప్నఁ డాకవిలె గట్టు కోపులఁ బుణ్యములెల్ల గోవిందుని కిచ్చితిమి పూఁపల స్వర్గము త్రోవ భుజవేయరో చ. అతుమలో నబ్జాన మాచార్యుఁడే పాపె ఆతల జన్మాల వాకిలటు ముయ్యరో చేత హరిదాస్యమున జీవన్ముక్తుఁడనైతి జాతి యధర్మములాల సంబంధము విడరో చ. పరమాత్ము చింతచేత బదుకు నిశ్చయమాయ ధరఁగైవసము గావో తగుచిత్తమా యిరవైన శ్రీవేంకటేశుఁ డేలుకొనె మమ్ము పరదేవతలు మాకుఁ బనిలేదు మీరు రేకు: 0100-03 లలిత సంపుటము: 01-503 పల్లవి: ఏల మోసపోయిరొకో యెంచి కాలపువారు బాలకృష్ణునిబంట్లె బ్రదుకవద్దా చ. పనులఁగాచేవాని బ్రహ్మ నుతించెనంటేను దెసల దేవుఁడేయని తెలియవద్దా సిసువు గోవర్ధనాద్రి చేతఁ బట్టి యెత్తెనంటే కొస రీతనిపాదాలే కొలువవద్దా చ. నరునికి విశ్వరూపున్నతిఁ జూపెనంటేను నరహరి యితఁడని నమ్మవద్దా