పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

360 చ. ఉడుకఁ బెట్టినట్టి వుడివోయిన నరకాల నుడుకుచుఁ దానుOడునాడు తడవువారెవ్వరంతటఁ దన్ను కడవేగ వేంకటపతిగాక చి.ఆ.రేకు:0002-03 దేవగాంధారి సంపుటము: 10-008 పల్లవి: ఎవ్వరుచెప్పినా మనసేల మానును యివ్వలవ్వలౌఁగాక యేలమానును చ. కమ్ముకొన్న యింద్రియాలు గారడించఁగా జీవుఁ డెమ్మెలఁ బొరలక మరేల మానును యిమ్ములేనికోరికలు యొక్కెక్కు లాడఁగాను వుమ్మడికర్మాలు సేయ కూర కేల మానును చ. పేరడిమదములెల్లా పెనగొనఁగా నొరుల నీరసించ కీ దేహి యేలమానును తీరని చలము లివి తెలివి చెరుచఁగాను యేరవెట్టుకొనియుండ కేలమానును చ. వుడివోనియాసలు వొత్తుకోలు సేయఁగాను యిడియక యీప్రాణుఁ డేలమానును కడువేగ శ్రీవెంకటనాధుఁడు గావఁగా నెడయక కని మన కేలమానును రేకు:0016-03 నాట సంపుటము: 01-097 పల్లవి: ఎవ్వరెవ్వరివాడో యీ జీవుఁడు చూడ నెవ్వరికి నేమానో యీ జీవుఁడు చ. ఎందరికిఁ గొడుకుగాఁ డీజీవుఁడు వెనక కెందరికిఁ దోఁబుట్టఁ డీజీవుఁడు యెందరిని భ్రమయించఁ డీజీవుఁడు దుఃఖమెందరికిఁ గావింపఁ డీజీవుఁడు చ. యొక్కడెక్కడఁ దిరుగఁ డీజీవుఁడు వెనక కెక్కడో తనజన్మ మీ జీవుఁడు యొక్కడి చుట్టము దనకు నీ జీవుఁడు యొప్పుడెక్కడికి నేఁగునో యీ జీవుఁడు చ. ఎన్నఁడును జేటులేనీ జీవుఁడు వెనకకెన్నిదనువులు మోవఁడీ జీవుఁడు యెన్నఁగల తిరువేంకటేశుమాయలఁ దగిలి యెన్నిపదవులఁబొందఁ డీజీవుడు రేకు:0003–02 వరాళి సంపుటము: 01-015 పల్లవి: ఎవ్వారులేరూ హితవు చెప్పఁగ వట్టినొవ్వులఁ బడి నేము నొగిలేమయ్యా చ. అడవిఁ బడినవాఁడు వెడలఁ జోటులేక తొడరి కంపలకిందు దూరినట్లు నడుమ దురితకాననములతరిఁ బడి వెడలలేక నేము విసిగేమయ్యా చ. తెవులువడినవాఁడు తినఁబోయి మధురము చవిగాక పులుసులు చవిగోరినట్లు భవరోగములఁ బడి పరమామృతము నోరఁ జవిగాక భవముల చవులాయనయ్యూ