పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

359 చ. కాంతల మోహమనేటి కారడవిలోఁ జిక్కి Q90éð) విజ్ఞానమార్గ మటు దప్పితి యింతలో శ్రీవేంకటేశు నెఱిఁగించె మా గురుఁడు మంతు కెక్కించఁగ నేను మంచి మేలు గంటి పె.అ.రేకు:0050-04 గుజ్జరి సంపుటము: 15-284 పల్లవి: ఎవ్వరు నాకు దిక్కు యేమని చెప్పదు నిఁక అవ్వలికి నివ్వలికి హరి నీవే కాకా చ. యెన్నటిప్రతిబంధమో యెంచఁ గామక్రోధములు వెన్నాడి నేఁ బుట్టితేనే వెంటఁ ಬುಣ್ಣಿನಿ మున్నిటికొలమెట్టిదో మొగి మదమత్సరము లన్నిలోకములఁ జొచ్చినందుఁ జొచ్చీని చ. యొక్కడి ఋణమో నాకు నీ దేహభోగములు పక్కన నేడనుండినా బడివాయవు తక్క కేనాటికర్మమో తగఁ బుణ్యపాపములు చిక్కులై కలలోనఁ జిమ్మి రేఁచీని చ. యెందరిపగో కాని యినా తమోరాజసములు సందడించి చలములు సాదించీని యిందునే శ్రీవేంకటేశ యింతలో నన్నేలితివి కిందుపడి యీవే నన్ను గెలిపించీని రేకు:0255-03 శంకరాభరణం సంపుటము: 03-316 పల్లవి: ఎవ్వరుఁ గాననివాఁడు యశోద గనెనట్టే పవ్వళించే బ్రహ్మతండ్రి బాలుఁడయ్యె నట్టె చ. ఘనయోగీంద్రుల మతిఁ గట్టువడనట్టివాఁడు పనిలేక రోలఁ గట్టువడినాఁడట్టె తనియ సురలకు పాదము చూపనట్టివాఁడు మొనసి బండిమీఁద మోపినాఁ డట్టె చ. అమృతము చేతఁ దచ్చి అందరికిచ్చినవాఁడు తమితో వెన్న దొంగిలెఁ దానె యట్టె గుమురై దేవదానవకోటికిఁ జిక్కనివాఁడు భ్రమసి గోపికల పాలఁ జిక్కినాఁ డట్టె చ. యిందుఁ గలఁ డిందులేఁడనెంచి చూపరానివాఁడు అందమై రేపల్లెవాడ నాడీనట్టే అంది కృష్ణావతారమయినట్టి దేవుఁడే యిందున శ్రీవేంకటాద్రి యొక్కి నిలిచెనట్టే రేకు: 9079-01 దేశాక్షి సంపుటము: 04-580 పల్లవి: ఎవ్వరుగల రెవ్వరికి ఇవ్వల నవ్వల నితఁడేకాక చ. ముద్ద సేసినటు మొదలఁ గడుపులోఁ బెద్దగాఁ దాఁ బెరుగునాఁడు ఒద్దనెవ్వరుండిరొకరైనా ఒద్దికైన బంధుఁ డొకఁడేకాక చ. వరతఁ బోవునట్టి వడిసంసారపు తెరలుఁ దగిలి తాఁ బిరుగునాఁడు వెరవకుమని భావించువారెవరు త్రలితోడ నీత్రcడె కాచుఁగాక