పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

327 చ. ఇందుకొరకె నేను ఇన్నాళ్లు పాటుపడితి ముందు వెనకెంచక నే మూడుఁడ నైతి అంది శ్రీవేంకటేశ్వరుఁడంతటా నుండి నాచందము చూచి కావఁగ జన్మమే యీడేరె పె.అ.రేకు: 0039-04 రామక్రియ సంపుటము: 15-222 పల్లవి: ఎట్టు రక్షించేవో కాని యిందిరారమణ నన్ను దట్టపు నీ దాసానుదాసుఁడ నేను చ. గాటపు వైరాగ్యము కందువ సుజ్ఞానము మాటలలోననే కాని మతి నుండదు నీటున నహంకారపు నీరసగుణములు మాటునఁ దిరుగు దుర్మానుఁడ నేను చ. నవనవవిధముల నానాపుణ్యము చెవుల వినుటే కాక సేయుట లేదు భవజలధులలోన పడి పొరలి మునిఁగి చవి మరిగిన నిత్యచపలుఁడ నేను చ. శ్రీవేంకటేశ్వర నీ సేవకుఁడ ననియేటి భావ మొక్కటె కాని భక్తి యెఱుగ యేవిధులఁ బడలేక యిటు నీకె శరణని దేవులతో విఱ్ఱవీఁగే డింగరీఁడను రేకు: 0190-01 లలిత సంపుటము:02-456 పల్లవి: ఎట్టు వలసినఁ జేయు మిన్నియు నీచిత్తమె నెట్టన(నె?) నొకఁడనా నీవే యింతాను చ. వేవేలు నీకు విన్నవించేదేమి తొల్లే సావధానముగ సర్వసాక్షివి నీవు ఆవల నాకిటు సేయుమని చెప్పేదేమి నేను దైవికమైనట్టి స్వతంత్రుఁడవు నీవు చ. తగిలి నిన్ను నాలో ధ్యానించేదేమి తొల్లె జగతి నీవు పూర్ణచైతన్యుఁడవు జిగి నీనామము నోరఁ జిక్కించి నుడిగేదేమి మగుడి శబ్దాక్షరమంత్రరూపుఁడవు చ. చేవమీర సిరులఁ బూజించేదేమి నిన్ను శ్రీవేంకటేశ నీవు శ్రీపతివి దేవదేవ నిన్ను నీవే తేఁకువెల్లా నెంచుకొని కావుము నీవొక్కఁడవే కరుణానిధివి రేకు:0208-03 మాళవిగౌళ సంపుటము: 03-045 పల్లవి: ఎట్టు వలసినాఁ జేయు మేఁటి విన్నపము లిఁక కట్టుకో పుణ్యమైనాఁ గాక మరేమైనాను చ. నన్ను నెంచి కాచేనంటేనా యవగుణి నేను నిన్ను నెంచి కాచేనంటే నీవు లక్షీపత్రివి యిన్నిటా నాకంటే హీనుఁడిఁక మరెవ్వఁడూ లేఁడు వున్నతి నీకంటే ఘనులొకరూ లేరు చ. నిలువెల్లా నెంచుకొంటే నివ్వరిముల్లంత లేను బలువుఁడ నీవైతే బ్రహ్మాండము యెలమి నే నుపకార మెవ్వరికిఁ జేయలేను మెలఁగి నీవే తృణము మేరువు సేయుదువు