పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

314 కేలఁ బూని కుల గిరు లదర భాల లోచనము ప్రకటింపుచు లయ - కాలుఁడై వెలసెఁ గడిఁది సింహుఁడు చ. కుటిల నఖంబుల ఘరోరాకారత తొట తొట నెత్తురు దొరుగఁగను చటుల దానవులఁ జదుపుచు శ్రీవేం కటమున నిలిచె సాకారసింహుఁడు రేకు:0068-03 ముఖారి సంపుటము: 01-354 పల్లవి: ఎక్కడనున్నా నీతఁడు దిక్కయి మాదెసఁ దిరిగీఁగాక చ. సరసుఁడు చతురుఁడు జగదేకగురుఁడు పరమాత్మడఇ9ల బంధువుఁడు హరి లోకోత్తరుఁ డతఁడే నామతి సిరితోఁ బాయక చెలఁగీఁగాక చ. ఉన్నతోన్నతుఁ డుజ్జ్వలుఁ డధికుఁడు పన్నగశయనుఁడు భవహరుఁడు యున్నిటఁగ లిగిన యిందిరారమణుఁడు మన్ననతో మము మనిపీఁగాక చ. మమతల నలమేల్మంగకు సంతత - రమణుఁడు వేంకటరాయఁడు జమళిసంపదల సరసవిభవముల తమకంబున మముఁదనిపీఁగాక రేకు:0263–01 సామంతం సంపుటము: 03-361 పల్లవి: ఎక్కడనున్నాఁ బోదు యేతులైనఁ బోనీదు వొక్కటి కొక్క బంధము వూహింప నెక్కుడు చ. బుడిబుడి మాయలఁ బొరలేటి దేహికి కడవరాని బంధము కాOత్రలు యెడపడ కందుకంటే నెక్కుడైన బంధము కడునాసుఁ బొరెరలించు కనకము చ. బాలులకు వృద్దులకు పాయపు వివేకులకు తేలించే బంధములు దినరుచులు మూలనున్నాఁ బోనీదు ముంగిటనే వేసేది వేళ గాచిన బంధము విద్యాగర్వము చ. పాయ దేజంతువులైనాఁ బశుపక్షులకునైనా బాయటి గీముల కట్టుఁబాటు బంధము యేయోడ శ్రీవేంకటేశ ఇంక నీదాసులకైతే చాయె చెప్పినట్టు సేసు సకలబంధములు పె.అ.రేకు:0045-03 ఆహిరి సంపుటము: 15-256 పల్లవి: ఎక్కడి జాలి యేఁటికి నీకు యెవ్వరివంకా నేమిఁకఁగలదు తక్కిన వెల్లా దడవక మాని ధర్మమెఱిఁగి బ్రదుకవో మనసా చ. పుట్టినయపుడే తమకర్మములు పొదుగకపోవు జీవుల నెల్లా నెట్టనవిధినిఁ గడచేనంటే నేర్పునఁ బడదు బ్రహ్మకునైనా అట్టిట్టనకా హృదయములోని హరికే శరణు చొచ్చితి నంటే గట్టిగనతఁడే దిక్కయి నిలిచి కావఁగఁ గలఁడు వెఱవకు మనసా చ. సాంపున నీ సంసారంబునకు చొచ్చినయపుడే తగిలెను తొడుసు