పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/310

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

308 చిక్కని కృపాకటాక్షసీమ నున్నదిదివో చ. చేసేటి పుణ్యఫలాలు శ్రీవైష్ణవులచేత రాసులై యిరుదెసల రాలీనివే ఆసల విజ్ఞానార్థ మదివో ప్రపన్నులభాసురపుఁ బెదవులఁ బాఁతి పైపై నున్నది చ. సకలదేవతలచే సాధించే వరములు మొకరి తదియ్యులమూఁక నిదివో వెకలి శ్రీవేంకటాద్రివిభుని మహిమలెల్లా ప్రకటించి వీరి సల్గాపాన నున్నదిదివో రేకు: 0308-05 శ్రీరాగం సంపుటము: 04-047 పల్లవి: ఎందుఁ గాఁపురము సేతు నేది నిజ మేది గల్ల ముందర నొక్కదినమే మూఁడు గాలములు చ. తనుభోగముల నివే తగ నొక లోకము మనసులో తలపోఁత మరి యొక్క లోకము యెనసిన కలలోని దిది యొక్క లోకము మునుపు వెనకలివే మూఁడు లోకములు చ. పంచభూతముల చేతిబంధ మొక్క దేహము యెంచఁగ నూరుపుగాలి యిది యొక్క దేహము కొంచక త్రిగుణములగురి సూక్ష్మ దేహము ముంచె నిదె వొకటిలో మూఁడు దేహములు చ. జీవునిలోపలివాఁడు శ్రీవేంకటేశుఁడు తావై వెలినున్నవాఁడు తా నొక్కఁడే శ్రీవేంకటాద్రిమీదఁ జెలఁగినాతఁ డీతడే మూవంకల మముఁ గాచె మొక్కితి మాతనికి రేకు:0066-01 శుద్దవసంతం సంపుటము:01-340 పల్లవి: ఎందుఁ జూచినఁ దనకు నిన్నియును నిట్లనే కందులేనిసుఖము కలవైన లేదు చ. సిరులు గలిగిన ఫలము చింతఁ బొరలనె కాని సాలది సంతోష మించుకయైన లేదు తరుణి గల ఫలము వేదనలఁ బొరలుటె కాని నెరసులేని సుఖము నిమిషంబు లేదు చ. తనువుగల ఫలము పాతకము సేయనె కాని అనువైన పుణ్యంబు అది యింత లేదు మనసుగల ఫలము దుర్మతిఁబొందనే కాని ఘనమనోజ్ఞాన సంగతి గొంత లేదు చ. చదువుగలిగిన ఫలము సంశయంబే కాని సదమల జ్ఞాననిశ్చయమింత లేదు యిది యెరిఁగి తిరువేంకటేశ్వరునిఁ గొలిచినను బ్రదుకు గలుగును భవము ప్రాణులకు లేదు రేకు:0227-05 మాళవి సంపుటము: 03-154 పల్లవి: ఎందుఁ జూచినా నీవే ఇదివో నీ ప్రతాపము నందకధరుఁడ నీకు నమో నారసింహా చ. అచ్చలపు బ్రహ్మాండమది నీకుఁ బెద్దగుహ చెచ్చెర నహోబలాద్రి సింహాసనము అచ్చటఁ గనకడైత్యుఁ డాహారపుమొగము