పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

306 ఇక్కువ నన్నుఁ దలఁచి యెట్టు మన్నించేవో చ. కోటులైన వేదములు కొనాడీ నిన్నందులో నా నోటి విన్నపము లొక్క నువ్వుగింజంతే మాటలు నేరక కొఱవలి వాకిట నుండ బాటగా నీదయ నాపైఁ బారుటెట్లో చ. అచ్చపు నీదాసులు అనంతము వారలకు రిచ్చల నేనొక పాద రేణువ నింతే ఇచ్చగించి శ్రీవేంకటేశ నిన్నుఁ దలఁచుక మచ్చికఁ గాచితి నన్ను మఱవనిదెట్లో పె.అ.రేకు:0012-02 లలిత సంపుటము: 15-063 పల్లవి: ఎందలివాఁడనో యెఱుఁగను కందువ నీవే కావవే దేవ చ. తలఁతు నూరకే దైవము నొకపరి తలఁతును సంసారధర్మము నొకపరి వెలయఁగ సాలీఁడు వేసిన కండెయై పొలసీఁ గాలము పొద్దుకుఁ బొద్దు చ. ఒకపరి యొక్కుదు వుబ్బునఁ బొడవునకు వొకపరి దిగుదును వూరకే కిందికి యొకదిగఁగ కృషికుఁడెత్తు యేఁతమై అకటా కర్మము లాడించీని చ. ఆవల నన్నిట నహంకరించితి శ్రీవేంకటేశ్వర సేవించితి నిన్ను చేవ లేక యిటు చెఱకునఁ బండై భావం బిటువలె పరిగెను నేఁడు రేకు: 0381-05 సామంతం సంపుటము: 04-474 పల్లవి: ఎందలివారమో నేము యొఱఁగ వసముగాదు సందడి విష్ణునకే శరణు చొచ్చెదము చ. తెరదీసినట్టుండు తెలిసితే జ్ఞానము మరుగక మఱచితే మరఁగై తోఁచు వురియై తగులుఁ గర్మ మూడిచితే నూడును యిరవైన హరి మాయలెల ఇంపు చున్నవి చ. కడుఁ బుణ్య వశమై కాచుకుండు స్వర్గము నడుముఁ జూపమూలము నరకము తడవితే నంటును దాఁటేదే నేరుపు యొడయ కచ్యుతు మాయలెల ఇంపు చున్నవి చ. పట్టితేఁ దన మనసు పరమాత్మఁ గనిపించు చుట్టుకొంటే బంధమై సూడు సాధించు ఒట్టి శ్రీ వేంకటేశ్వరుఁ డోపి మమ్మునేలెఁ గాని ఇట్టె యా దేవుని మాయలెల ఇంచును రేకు:0186–05 భూపాళం సంపుటము: 02-436 పల్లవి: ఎందాఁక నిద్ర నీకిదె తెల్లవారెఁ గదె యిందిరారమణ నీవిటు మేలుకొనవే చ. కమలనాభుఁడ నీకు గంగాదినదులెల్లనమర మొకమజ్జనం బాయితము సేసె తమితోడఁ గనకాద్రి తానే సింహాసనము