పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

208 ఆదిగొని మనోవీధులందు నేఁగీ నిదివో చ. జీవులెల్లా సారథులు శ్రీవిభుని తేరునకు కావించుఁ నెజ్ఞాలు పడిగల గుంపులు భావించఁ దన ప్రకృతి పట్టపుసింహాసనము వేవేలు సంపదలతో వెలసీ నేఁడిదివో చ. చందురుఁడు రవియును సరుస బైఁడికుండలు చెందిన పుణ్యములెల్ల సింగారాలు అందపు శ్రీవేంకటేశుఁ డలమేలుమంగఁ దాను కందువల మెరయుచు కరుణించీ నిదివో రేకు:0079-04 రామక్రియ సంపుటము: 01-379 పల్లవి: ఇందిరా నాయక యిదివో మాపాటు చెంది నీవే గతి చేకొనవయ్యా చ. తీసీఁ గోరికతీదీపు లొకవంక లాసీ సంసారలంపటము మూసీఁ గర్మము మునుకొని పరచింత సేసేదేమిఁకఁ జెప్పే దేమి చ. వంచీ నాసలు వలసినచోటికి పొంచీ దురుణబోగములు ముంచీ యావనమోహాంధకారము యెంచేదేమి సాదించేదేమి చ. యెఱిఁగీఁ జిత్తము యించుకించుక నిన్ను మఱవనినీపైభక్తి మతినుండఁగా నెఱి శ్రీవేంకటపతి నీవే కాతువుగాక వెఱచి నేఁజేసే విన్నపమేమి రేకు:0088-06 సామంతం సంపుటము: 01-434 పల్లవి: ఇందిరాధిపుని సేవ యేమరకుండుటగాక బొందితోడిజీవులకు బుద్దు లేఁటిబుద్దులు చ. రేయెల్హా మింగిమింగి రేపే వెళ్లనుమియు బాయట నిద్రాదేవి పలుమారును చాయలకు నిచ్చనిచ్చా జచ్చిచచ్చి పొడమేటిమాయజీవులకునెల్లా మని కేఁటిమనికి చ. కనురెప్ప మూసితేనే కడు సిస్టే చీఁకటౌను కనురెప్ప దెరచితే క్రమ్మర బుట్టు ఘనమై నిమిషమందే కలిమి లేమియుఁ దోఁచె యెనయుజీవుల కింక యెఱు కేఁటియెఱుక చ. వొప్పగుఁ బ్రాణము లవి వూరుపుగాలివెంట యెప్పుడు లోనివెలికి నెడతాఁకును అప్పఁడు శ్రీవేంకటేశుఁ డంతరాత్ముఁ డందరికి తప్పక యాతఁడే కాచు తలఁపేఁటి తలఁపు రేకు:0093-06 బౌళి సంపుటము: 01-464 పల్లవి: ఇందిరానాథుఁ డిన్నిటి కీతఁడింతే బందెలకర్మములాల పట్టుకురో మమ్మును చ. యెఱిగిసేసినవెల్లా నీతనిమహిమలే యొఱగక చేసినది యీతనిమాయే తెఱఁగొప్ప రెంటికిని తెడ్డువంటివాఁడ බටර්‍ම