పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

205 యిల్లాలై సుఖమిచ్చు నితని మహిమరూపే వెల్లవిరిఁ దనము లీవిష్ణునిరూపే చ. గ్రామదేశకులములు ఘనుఁడితనిరూపే కామించునర్థ మీతఁడై కలుగు నీరూపే దీమపాన నిహపరబ్రిష్టము లితనిరూపే యేమేర దాతయు దైవ మీతనిరూపే చ. కాలము నితనిరూపే కర్మము నితనిరూపే యేలి యాచార్యుఁడు చెప్పేదితనిరూపే శ్రీలలనాపతి శ్రీవేంకటేశ్వరుఁడే పాలించఁగాఁ గంటి నే నీపరమాత్మురూపే రేకు:0134-02 గుజ్జరి సంపుటము:02-138 పల్లవి: ఇందరిలో నే మెందుఁబోలుదుము యిందరిఁ బోలిన జీవులమే కందువ వీరలఁ దలఁచి చిత్తమిది కలఁగెడి దైవము కావఁగదే చ. యెందరొకో జరాదుఃఖము లేచి యనుభవించేటివారు యెందరొకో దరిద్రదుఃఖము లెఁసగి యలమటించేటివారు యెందరొకో బంధనతాడనహీనదెసల నుండెడివారు యెందరొకో దాసదాస్యవిధి నెడయరాక చెఱలయినవారు చ. యెందరొకో మరణదెసలచే నిల సంయోగవియోగదుఃఖితులు యెందరొకో జన్మరోగముల నెక్కువ భయమందేటివారు యెందరొకో రాజుల చోరుల హింసలకు లోన యినవారు యెందరొకో పొడమిన జీవుల కెక్కడ నెక్కడ నేపాటో చ. యెందరొకో యీదుఃఖనివృత్తికి యెడసి మిమ్ముఁ గొలిచినవారు యెందరొకో సంపదలకు లోనై యేతాయాతనఁ బడువారు యెందరొకో శ్రీవేంకటేశ యిపుడెక్కువ నీశరణము చొచ్చి యిందును నందును సుఖులై లోకుల నిందరిఁ జూచుచు నవ్వెడివారు రేకు: 0302-02 మంగళకౌశిక సంపుటము:04-008 పల్లవి: ఇందరు నీకొక్కసరి యొక్కువ తక్కువ లేదు చెంది నీసుద్దులు యేమిచిత్రమో కాని చ. నీనామ ముచ్చరించి నెరవేరె నొక్క మౌని నీ నామము వినక నెరవేరె నొకఁడు వూని నిన్ను నుతియించి భోగియాయ నొకఁడు మోనమున నిన్ను దిట్టి మోక్షమందె నొకఁడు చ. మతిలో నిన్నుదలఁచి మహిమందె నొకయేూగి తతి నిన్నుదలఁచకే తగిలె నిన్నొకఁడు అతిభక్తిఁ బని సేసి అధికుఁడాయ నొకఁడు సతతము బనిగొని సఖుఁడాయు నొకఁడు చ. కాఁగిటి సుఖములిచ్చి కలసిరి గొందరు ఆఁగి నిన్ను వెంటఁదిప్పి ఆవులు మేలందెను దాఁగక శ్రీవేంకటేశ దగ్గరైన దవ్వయిన మాఁగి నిన్ను దలపోసే మనసే గుఱుతు రేకు: 0300-01 దేసాక్షి సంపుటము: 03-578 పల్లవి: ఇందరు నెఱిఁగినదీ బదుకు పొందినదాఁకా భోగించవలయు చ. పొట్టఁ బొరుగులివె పుణ్యపాపములు నట్టనడుమనే నా బదుకు వెట్టిమోపువో వెడ సంసారము