పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

204 యేడనైనా నుండనీ యిచ్చెన యోగీశ్వరుఁడు వాడలో కుమ్మరిపురువువలె నెందు నంటఁడు చ. చేనంటి యే పుణ్యమైనాఁ జేయని యోగీశ్వరుఁడు నూనె గొల్చిన కుంచమై నుశికేలును వీనుల నేమైనాను వినని యోగీశ్వరుఁడు నానేటి తామరపాకై నడుమఁ దా నుండును చ. వొడ్డి చవులుగొనని ఉత్తమయోగీశ్వరుఁడు జిడ్డంటని నాలికై నిశ్చింతాన నుండు యెడ్డవలె మెలఁగని యెదలో యోగీశ్వరుఁడు దొడ్డ శ్రీవేంకటేశ్వరుతోనే రమించును రేకు: 0065–01 సామంతంసంపుటము: 01-334 పల్లవి: ఇందరికి నభయంబు లిచ్చుఁ జేయి కందువగు మంచి బంగారు చేయి చ. వెలలేనివేదములు వెదకితెచ్చిన చేయి చిలుకుగుబ్బలికిందఁ జేర్చు చేయి కలికియగు భూకాంతఁగాఁగిలించిన చేయి వలనైన కొనగోళ్ళవాఁడి చేయి చ. తనివోక బలిచేత దానమడిగిన చేయి వొనరంగ భూదానమొసఁగు చేయి మొనసి జలనిధి యమ్మ మొనకుఁ దెచ్చిన చేయి యెనయ నాఁగేలు ధరింయుచు చేయి చ. పురసతుల మానములు పొల్లసేసిన చేయి తురగంబుఁ బరపెడిదొడ్డ చేయి తిరువేంకటాచలధీశుఁడై మోక్షంబు తెరువు ప్రాణులకెల్లఁదెలిపెడి చేయి రేకు: 0359-06 సామంతం సంపుటము: 04-350 పల్లవి: ఇందరిగాచిన నీవు యిట్టే నీవు నాకు కందువ నిధానమవై కలవుగా నీవు చ. అరసి ధ్రువుని గాచినట్టి నీవు కరుణతోఁ బ్రహ్లాదుఁ గాచిన నీవు కరిరాజు శరణంటేఁ గాచిన నీవు కరతలామలకమై కలవుగా నీవు చ. గట్టిగా విభీషణుఁగాచిన నీవు అట్టె ద్రౌపదిఁ గాచినప్పటి నీవు చెట్టవట్టి బలిఁగాచిన నీవు నాకు కట్టిన ముడుపవై కలవుగా నీవు చ. కమ్మర సుగ్రీవునిఁ గాచిన నీవు నేఁడు కిమ్ముల లోకములు రక్షించే నీవు నెమ్మది శ్రీ వేంకట నిలయ నీవు మాకు కమ్ముకొని దాపుదండై కలవుగా నీవు రేకు:0317-06 రామక్రియ సంపుటము: 04-101 పల్లవి: ఇందరిపై భిన్నభక్తులేఁటికి మాకిఁక అందరిలో అంతరాత్మ యాతని రూపే చ. తల్లియై యుండేవాఁడు తగ నితనిరూపే యెల్లగాఁ దండైనవాఁడు నితనిరూపే