పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

166 చ. మరిగి నీపై భక్తి మాకుఁ గలుగుటెల్లాను అరసి నీవు రక్షించే ఆసకొరకే హరి నీవు భక్తవాత్సల్యము మాపై జేయుటెల్ల ఇరవైన నీకు నిరుహేతుకమే చ. కొసరుచు నిన్ను నేము కొలిచినదెల్లాను వెస మా భారము నీపై వేయు కొరకే వసముగా నీవు నన్ను వలెనని యేలుటెల్ల యిసుమంతైన నిరుహేతుకమే చ. శ్రీవేంకటేశ్వర నీకుఁ జేయెత్తి మొక్కుటయెల్ల నీవే మావాఁడవై మన్నించుకొరకే ఆవటించి అంతర్యామివై నీవుండుటయెల్ల యేవలఁ జూచిన నిరుహేతుకమే రేకు: 0113-04 లలిత సంపుటము:02-076 పల్లవి: అవి యటు భావించినటూను కవగిరెని యిందుకుఁ గలఁగరు ఘనులు చ. అరయఁగ నేఁబదియక్షరములె పో ధరలోపల నిందాస్తుతులు సరిఁ బురాణములు శాస్త్రవేదములు యిరవుగ నిన్నియు నిందే పొడమె చ. వొక్క దేహమున నున్నయంగములు పెక్కువిధములై బెరసినవి చిక్కులఁ గొన్నిటి సిగ్గుల దాఁతురు యొక్కువ యతులకు నిన్నియు సమము చ. అంతరాత్మలో నంతర్యామై బంతులఁ దిరిగేటి బంధువులు చింతింప నతఁడే శ్రీవేంకటేశ్వరుఁడింతకుఁ గర్తని యెంతురు బుధులు రేకు: 0183-02 గుండక్రియ సంపుటము: 02-416 పల్లవి: అవియు నాకుఁ బ్రథమాచార్యులు త్రవిలి యూనెపము విుముఁ దలంపించుఁగాన చ. ధనవాంఛ మతిలోనఁ దగిలినప్పటివేళ దనుజారి మీమీఁద దలఁపు గలుగు పొనిగి భయదుఃఖములఁ బొరలినప్పటివేళ పనివూని మీమీఁది భక్తి గలుగు చ. చెలఁగి పాపములు మించినవేళ హరి మీ నలువు నామోచ్చారణంబు గలుగు బలిమి భవరోగముల బడలినప్పటివేళ వలుమూరు మీసంప్రార్థనలు గలుగు చ. ఇన్నిటాఁ దొలఁగి మిము నెరిఁగి కొలిచినవేళ మన్ననల పరిణామంబు గలుగు వున్నతపు శ్రీవేంకటోత్తముఁడ మిము నెదుటఁ గన్న యీవేళ సౌఖ్యంబులే కలుగు పె.అ.రేకు:0042-02 లలిత సంపుటము: 15-238 పల్లవి: అసలు చెరుచకుమీ యచ్యుత ఆ సుద్దులె యీ సుదులు అచ్యుతా