పుట:Tallapaka Adhyatmika Sankeertanalu.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

158 రేకు: 0381-01 మాళవి సంపుటము: 04-470 పల్లవి: అరుదీ కపీంద్రుని యధిక ప్రతాపము సురలకు నరుల కీ సుద్దు లెందుఁ గలవా చ. వుదయాచలము మీఁది నొక్కజంగ చాఁచుకొని వుదుటున నపరాద్రి నొక్కజంగ చాఁచుకొని తుద సూర్యమండలము తోడ మోము దిప్పుకొంటా పెదవులెత్తి చదివెఁ బెద్ద పూనుమంతుఁడు చ. వొక్క మొలగంట చంద్రు డొక్క మొలగంట రవి చుక్కలు మొలపూసలై చూపట్టఁగా నిక్కిన వాలాగ్రమందు నిండిన బ్రహ్మలోకము పిక్కటిల్లఁ బెరిగెను పెద్ద హనుమంతుఁడు చ. పడికిలించిన చేత బిరుదుల పండ్ల గొల తడయక కుడి చేత దశ దిక్కుల జడియక శ్రీ వేంకటేశ్వరునిమన్ననబంటు బెడిదపు మహిమల పెద్ద హనుమంతుఁడు రేకు:0166-05 బైరవి సంపుటము:02-321 పల్లవి: అరుదు నీచెరిత్రము హరి నే నిదియే తలఁచుకొని శరణంటిఁ గావు మిదియ విన్నపము సరిలేరు నీకు చ. పరగ నీయకారణబంధుత్వ మహల్యయందుఁ గంటిమి కరియందు నార్తరక్షకత్వము మెరయఁగఁ గంటిమి అరసి ద్రౌపదియందు నాపదుద్దారకత్వము గంటిమి శరణంటెఁ గాచుట ధర విభీషుణునందుఁ గంటిమి చ. మును భక్తవత్సలత్వము నీకు శబరియందుఁ గంటిమి అనాథనాథుడవు నీ వగుట గ్రీవునందుఁ గంటిమి పెనఁగి నిరుహేతుక ప్రేమ పరీక్షితునందుఁ గంటిమి నినుఁ గింకరాధీనుఁడని ప్రపదునియందేఁ గంటిమి చ. గోవర్ధనమందు సర్వజీవదయూపరత్వము గంటిమి భావించి సాందీపునందు ప్రతిజ్ఞాపాలకత్వము గంటిమి దేవ శ్రీవేంకటేశ్వర నీవు ద్రిష్టవరదుఁడవగుట తావైన నీకొనేటిదండ నొసంగేయందే కంటిమి రేకు: 9020-01 లలిత సంపుటము: 04-539(అవతారాలు) పల్లవి: అరుదైన భవదూరుఁడగు నీతఁడు అరిది భవములందునతఁడు వో యితఁడు చ. కొడుకుటెక్కెమురూపు కోరికైకొని పెద్ద కొడుకు కొరకుఁగా గోరపడి కొడుకువైరి భక్తిఁ గూడిన యూతని నడవిలోఁ జంపిన యతఁడు వో యితఁడు చ. ఆలి తమ్ముని రాక కలరి మెచ్చెడిచోట ఆలుఁ దానును నుండి యందులోన ఆలిచంటికింద నడ్డమువడుకున్న ఆలవాలమువంటి అతఁడు వో యితఁడు చ. సవతి తమ్ముఁడు గోవుఁ జంపఁ బట్టుక పోయి సవతి తమ్మునియింట సడిఁబెట్టఁగా సవతులేనిపంటఁ జప్పరించివేసి అవల యివల సేసి నతఁడు వో యితఁడు