పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 6]

41

త గి న శా స్తి

 పాత్రు--అయితే నీవొప్పుకొన్నట్టేనా?
 రెబె--ఒప్పుకొన్నాను; గాని you must mend your ways-- తప్పతాగి అంతా పాడుచెయ్యకు. తెలిసిందా?
 పాత్రు--ఆ! అంతా పాడుచేస్తానా?
 రెబె--సరే, Darling,  నీ  plan నాకు సమ్మతమే. అలాగైతే నాపై నీకు ప్రేమ ఉంటుందా?
 పాత్రు--ప్రేమా? Well I never| నీపై నాకు ప్రేమ ఉండదా? నెన్నెంత ప్రేమింతునంటే words fall me to describe adequately the love I bear you. Immeasurable!
 రెబె--మంచిది. నేను పోతాను. వంట కొంచెము తరువాయి ఉన్నది. (ఫోవును)
 పాత్రు--దీనికి నామీద ప్రేమ ఇంకాపోలేదు. ఎందుకు పోతుందు? భగవంతుడు నా కెట్టి అందము పెట్టినాడు! (అద్దము చూచుకొని) హాయి హాయి! అచ్చంగా Apollo-like ఒక్క మీసమే తేడా దీనిని తీసివేతునా? ఇప్పుడే కాదు. పండువెంట్రుక రానీ...(తెర వాలును)