పుట:TaginaShaastiKaameishvaraRaavuShriipaada.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం.1]

5

త గి న శా స్తి

 పాత్రు--Good morning, my friends! మీరంతా ఇక్కడేమి ఆలొచిస్తూన్నారు! What news? విశేషాలేమి?
  ఉమా--మేమందరమూ ఒక చిక్కులో పడ్దాము.
  పాత్రు--What is the matter?  సంగతేమిటి?
  పూర్ణే--మాపెళ్ళాలందరూ వట్టి మూర్ఖులు.
  సూర్య--వాళ్ళతో బాధ పడలేక లేచిపొదామా అనుకొంటున్నాము.
  పాత్రు--Indeed! అలాగా!
  ఉమా--వాళ్లని చంపడానికీ వీలులేదు.
  రామ--ఇంకోర్తెను కట్టుకుంటే ఇల్లు గుల్లవుతుంది.
  సూర్య--ఇం కేమిసాధనము?
  పాత్రు--By Jupiter! There is a way out of the crux మంచి ఉపాయముంది. దాటడానికి
  అందరు--ఏమిటది?
  పాత్రు--To file a suit !.  వాళ్ళమీద దవాతేవడమే.
 రామ--ఏడిచినట్లుంటుంది.
 పూర్ణే--పెళ్ళాంమీద దావా?--చచ్చినాము రా బాబూ! గెల్చినా కష్టమే ...ఓడినా కష్టమే. అది వీలు లేదు.