పుట:TELUGU-NAVALA.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

తెలుగు నవల


నవలలు వెలువడ్డాయి. తెలుగునవల ఇజీవలే శతజయంతి జరుపుకొన్నా మొదటి డెబ్బై ఆయిదు సంవత్సరాలలో వెలువడిన నవలలకన్నా ఈ పాతిక సంవత్సరాలలో వెలువడ్డ నవలలే సహస్రాధికంగా ఎక్కువవుంటాయని చెప్పాలి. మొదటి డెబ్భై అయిదు సంవత్సరాలలో వచ్చిన వాటికంటే నిస్సందేహంగా తరవాతి యీ పాతికేళ్ళలో ఐదారు రెట్లు నవలలు వచ్చివుంటాయి. వస్తువైవిధ్యం, శిల్పం, ప్రయోగాలూ కూడా, ఆధునిక కాలంలో చెప్పుకోదగినంతగా ఈ ప్రక్రియ సంతరించుకొన్నది తెలుగు సాహిత్యంలో ఈనాడు నవల కున్నంత ప్రాచుర్యమూ, పలుకుబడి మరే ఇతర సాహిత్య ప్రక్రియకూ లేదేమోననుకోవచ్చు. అందుకనే కొందరు ఇది నవలాయుగం అని కూడా అంటున్నారు.

ఆధునిక సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణగారు స్పృశించని ప్రక్రియలేదు. చిన్న కథ నుంచి మహాకావ్యం వరకూ వారు సాహిత్యవ్యవసాయం చేశారు. ఆయనది ఒక విలక్షణమైన మార్గం. సనాతన సంప్రదాయాలపట్ల వారికి అభినివేశం ఎక్కువ. ఏ మాత్రం అవకాశం వచ్చినా సనాతన దృక్పథాన్నీ, ఆచారాలను, ఆయన తన రచలనలో ప్రతివాదించి వాటి వైశిష్ట్యం నిరూపించే ప్రయత్నంచేస్తూ ఉంటారు. గొప్పకల్పనాశక్తి, భావావేశమూ, భాష మీద ప్రభుత ఉన్న రచయిత ఆయన. కాని మంత్రశాస్త్ర ప్రక్రియలు సామాన్యులకు అర్థం కానట్లు, విశ్వనాథవారి రచనలు ఒక వర్గం వారిని మాత్రమే ఉత్తేజితులను చేస్తవి. విశ్వనాధ చేపట్టిన సర్వసాహిత్య ప్రక్రియలలోనూ వారు అధిక సంఖ్యలో నవలలే వ్రాశారు. నవలల్లో కూడా సాంఘీకాలూ, చారిత్రకాలు, పౌరాణికాలు, ఆధిక్షేపిక నవలలు. వైమర్శికాలు, ఎన్నో వ్రాశారు. చిన్నా పెద్దా కలిపి చూస్తే విశ్వనాథ సుమారు అరవై నవలలదాకా వ్రాసినట్లు కన్పిస్తుంది. చాలా ప్రసిద్ధి పొందినవి వేయిపడగలు, ఏకవీర, చెలియలికట్ట, మా బాబు,తెరచి రాజు; బద్దన్న సేనాని, మొదలైనవి. ఇవికాక ఇటీవల ఆయన పురాణరవైగ్రంథమాల పేరుతోనూ, నేపాల రాజవంశ చరిత్రకు సంబంధించీ కొన్ని నవలలు ప్రకటిందారు. మ్రోయు తుమ్మెద, కుణాళుని శాపం, ఆరు నదులు, దమయంతీ స్వయంవరం, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, సముద్రపు దిబ్బ, మొదలైన నవలలు తెలుగు పత్రికలలో ధారావాహికంగా ప్రచురితాలై గత పదిహేను, ఇరవై సంవత్సరాలలో పుస్తక రూపంలో వచ్చాయి.