పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

275


సీ.

స్వప్నలబ్ధములైన సౌఖ్యసంపద లట్లు
        [1]జలముపై వ్రాయు నక్షరములవలె
చిత్తారుప్రతిమల సింగారములభౌతి
        త్యాగభాగవిహీనధనముభంగి
విపినంబులను నిండువెన్నెలపోలిక
        [2]వెలివానిపై మోహవేదనగతి
చిరకృతఘ్నునకు జేసిన యుపకృతిచాడ్పు
        దారిద్ర్యుని మనోరథము తెఱఁగు


తే.

చౌటభూమిని జల్లుబీజములవిధము
పథ మెఱుంగని మన్మనోరథములెల్ల
నిష్ఫలమెగాక తథ్యమై నెగడగలవె
వానితో పొందు నావంటిదాని కెందు.

50


చ.

అని తలపోసి దుఃఖవివశాకులచిత్తముతోడుతన్ చివా
లున వెసలేచి యాపెరటిలో నొకకుందనికుంజమందిరం
బున బవడంపుమంచమున పువ్వులసెజ్జను బవ్వళించి నె
మ్మనమున మాటిమాటి కభిమన్యుని చింతనజేయు చున్నెడన్.

51


ఉ.

అంత ఘటోత్కచుం డడవియందుననుండియు ద్వారకన్ ప్రలం
బాంతకునింట లగ్నసమయంబును దాకొనఁగా నహస్కరుం
డంతట గ్రుంకుటం గని లయాంతకునిం బలె దోషవహ్ని యం
తంత జెలంగఁ దమ్మునకు నమ్మలకుం దెలియఁగ జెప్పియున్.

52


క.

గగనతలమునకు చివ్వున
నెగసి ఘటోత్కచుఁడు యదుకులేశ్వరుభవనం

  1. లిఖియించు జలముపై లిపులమాడ్కి
  2. వెలయాలిపై మోహవేదనగతి - మూ