పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

105


సరసమాడఁదలంచు సైగలు గావించు
        నీటులు బచరించు నిమ్మళించుఁ


గీ.

జెనక గమకించుఁ ద్వరయేల యని వచించు
తరుణినీక్షించుఁ దనలోన దా హసించు
బలితమై మించు మోహంబు నిలువరించు
ధర్పకుఁడు నించు శరములఁ దల్లడించు.

124


క.

శరదిందుబింబతేజ
స్స్ఫురణవయోరూపవిభవశోభితునకు బి
త్తఱిచూపున్ మరుచూపున్
దదితీపున్ వెరపునెఱపు తహతహతోడన్.

125


మ.

తొలుతం చంచలవృత్తి దోఁచె మది, కందోయిన్ విలోకింప న
వ్వలచిత్తం బనురాగముం గలిగె, క్రేవన్మోవి వీక్షింప కే
వలధౌర్త్యంబు వహించెఁ జన్నుగవభావం బందు నిట్టట్టుగా
దొలఁగెన్ హారములన్ మనంబు కటినెంతో శూన్యమయ్యెన్ మదిన్.

126


మ.

అల రంభాకృతు లీతొడ ల్విమలహేమకార మీమేను మం
జులనాసాపుట మాతిలోత్తమ లసత్స్ఫూర్తుల్ సుధల్ జిల్కు చూ
పులలీలల్ హరిణీవిలాసములు నిప్పూఁబోణి దేవాంగనా
వలి నొక్కొక్కటి నొక్కయంగమున గెల్వంజాలు లీలాగతిన్.

127


సీ.

ఘనసంపదలను నే నెనసియున్నఫలంబు
        పడతిపెన్నెఱులు జేపట్టినపుడు
నతులరాజాభిధానత గల్గిన ఫలంబు
        చెలియమోమున మోముఁ జేర్చినపుడు
హితవృత్తి కువలయం బేలగోరుఫలంబు
        కన్నెకన్నులు ముద్దుగొన్నయపుడు
భువనసామ్రాజ్యవైభవము గల్గు ఫలంబు
        యింతి నంగజుకేళి నెనసినపుడు