పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

109

తాలాంకనందినీపరిణయము


గీ.

నమృతసేవన మటుమీఁద నందుఫలము
కలికికెమ్మోవి చవిగొనఁగలిగినపుడు
నహహ! యిటువంటిచెలిఁ బొందునట్టి భాగ్య
మున్నదో? లేదొ! తెలియరాకున్న దిపుడు.

128


క.

తూండ్లవలె భుజము లతనుని
విండ్లవలెం బొమలు ధరణి వెదకిన నిదె పూఁ
బోండ్లతలమిన్న దీనిం
బెండ్లాడినవాని భాగ్యవిధి మేల్దలఁపన్.

129


సీ.

తరుణికి విలసదధరముఖవర్ణలో
        పం బౌచుఁ దనరె గుబ్బలబెడంగు
కలికికి యాననాకారశూన్యం బౌచు
        నానాఁడు జెలఁగె నెమ్మేనిసొబగు
లలనజఘనమండలదీప్తిని బొసంగె
        జలజాక్షికుంతలమ్ములమెఱుంగు
సతికిని చరమభాయుతకరమ్ములుగాఁ బ్ర
        కాశించె లసదూరుకాండయుగము


తే.

పొలఁతి కిటువలె నవయవంబులను దామె
యొకటి నొకటెంచి తమతమయునికి డించి
తాదృశాకృతులకు సాటి దనరుచుండ
మామకస్వాంతమలబడు టేమివింత.

130


సీ.

సారంగములమించు సతికొప్పుననె గాదు
        కనుదమ్ముల బెడంగునను హసించుఁ
బున్నాగముల మించుఁ బొక్కిలినే గాదు
        గంభీరగమనసంగతి నడంచు.
ఘనకాంచన మణంచు కాయంబుననె గాదు
        సరసనాసావిలాసత వహించు