పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

* Фо స్వీయ చరిత్ర ము డకి సంవత్సరములక్రిందట నభిలషించుచుంటిని. ఆప్పడాకోరిక దివాస్వప్న సదృశముగా కనఁబడినది; ఇప్పడది ప్రత్యక సిద్ధమైనది. అప్పడు రాజమహేం ద్రవరము ජූලද්ඨි పట్టణములలో సహితము యువజనులు సభలుచేయుటయే సౌమాన్యజనులదృష్టికి తప్పిదముగాఁ గనఁబడుచుండెను; ఇప్పడు చిన్నపల్లె అయందుసహితము సభలు జరగుచు నందు వివిధ విషయములు విత్కరింపఁ బడి జనసామాన్యముచే మెప్పొందుచున్నవి. ఆప్పడు శ్రీవిద్య పేరు చెప్పిన మాత్రన తలకంటకము గా నుండి బహుజనులచే దూషింపఁబడుచుండెను, ఇప్ప డెల్లయెడల బాలికా పాఠశాల లేర్పడి స్త్రీవిద్య యభివృద్ధినొంది సభలు ప్రసంగములు పుస్తకములు చేయఁగల శ్రీలచే నొప్పి భూషింపఁబడు చున్నది. ఆప్పడు దేశభాషలో పురుషులు చదువుటకు సహితము తగిన పుస్తకములు లేకుం డినవి ; ఇప్పడు పుస్తకరచనకయి సమాజములేర్పడి పురుషుల కుపయు క్తము లైనవిమాత్రమే -కాక من نوثق చదువఁదగిన పుస్తకములుగూడ దినదినాభివృద్ధి కొందుచున్నవి. ఆప్పడు విద్యాభిరుచిగల ధనవంతులకే పుస్తకసంపాదనము ఇళల వ్యయప్రయాస లభ్యమగుచుండెను ; ఇప్పడూరూర పఠనమందిరములు ప్రజలి బీదలకును పుస్తక సంపాదన మత్యల్పవ్యయ సాధ్య మగుచున్నది. ఆప్ప శాeధ్రణార్తాపత్రిక లంతగా లేకయు, ఉండిన యొకటి రెండును జదువువారు లేళడు, దివానక త్రములవలె తేజరిల్లకుండెను; ఇప్పడు దేశభాషావృత్తాంత పత్రికల సంఖ్య యధికమయి వేలకొలఁది చదువరసలను గలవయి కొన్ని పట్ట పగటి సూర్యునివలె ప్రకాశించుచున్నవి. ఆప్పడు ధూమనౌక మిఁద విద్యాగ మామా కొఱకు చెన్నపురికి వెళ్ళిన ਕਹਾ`8 ਭੈ ప్రాయశ్చిత్తములు విధింపఁబడుచుం డెను ఇప్పడు విద్యావాణిజ్య శిల్పశాస్త్రాభ్యాసార్థమయి ఖండాంతరముల పను ద్వీపాంతరములకును బోయి వచ్చినవారికిని బ్రాయశ్చిత్తము లక్కఱలేక పోవుచున్నవి. ఇటువంటివి చెప్పఁబూనినచో ననేకములు చెప్పవచ్చును. ఈ సంవత్సరము బాపట్ల మొదలయిన స్థలములయందు జరిగిన సభలును సభలలvకి జనులుచూపిన యుత్సాహమును మన దేశముయొక్క వర్ధమానస్థితిని, కర్తవ్య నిర్ణ య వ్యగ తను, నూతనోద్యోగానురాగమును, సహస్రముఖములఁ * Eroto3