పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/429

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నా లు గ న ప్రు క ర ణ ము 3F丁Fー విూకిప్పడు మరలఁ జెప్పచున్నాను. శరీరమందలి సమస్తాంగములును పరస్ప రానుకూలముగా నెదుగక యొక కడుపో కాలో యొక్కువగా నెదిగినప్పడు దానినిమహోదరత్లీపదాది నామములతో నశుభదాయకమైన రోగచిహ్నముగా నెట్లు భావింతు వెూ యర్లే ధార్మిక సాంఘికాభివృద్ధి పయత్నము ను పేకించి యొక్క రాజ్యాంగస్వాతంత్ర్యాభివృద్ధిని గూర్చియే యుద్యమించుటయు సంపూర్ణ సుఖ సాధకము కాఁజాల దని భౌవింపవలయును. బయిట సుఖదాయ కము లైనరాజ్యాంగస్వాతంత్ర్యములను సంపూర్ణముగా పొందఁగలవార వుంు నను వునయింటు కుటిలకులాచారభూతమునకు దాసులవుయి కడుపునఁ బుట్టిన బిడ్డల స్వాతంత్ర్యముల నైననియ్యఁజాలక యాయనాధశాలలు సంతతదుస్సహ వైధవ్యదుఃఖముల పాలయి బాధ పడుచుండఁగాఁ జూచుచు మన మేమిసుఖ మనుభవింపఁగలుగుదుము? ఇంట సుఖదాయకము లైన సత్కులాచారస్వాతం త్ర్యములను సంపూర్ణము గాఁ బొందఁగల వార వుంునను బయిట ధనప్రాణము లకు రక్షణము చేయని క్రూరనిరంకుశ ప్రభుత్వమునకు నిరంతరదాశ్యము చేయ వలసిన యెడల నేమి సుఖ వునుభవింపఁగలుగుదువు ? ఇంటను బయటనుగూడ హేయదాస్యమునుండి విముక్తులనుయి యుభయస్వాతంత్ర్యములను $7ంచc గలిగినప్పడు గదా మనము నిష్కళంక సౌఖ్యము నొంది యవ్యాజానందము నొందఁగలుగుదువు ? కాఁబట్టి నిజమైన దేశ కేవుము నపేక్షించిన పకమున దేనిని నపేక్షింపక సమస్తస్వాతంత్ర్యముల నిమిత్తమును సమస్తాభివృద్ధుల నిమి త్తమును సమానముగా కృషిచేయుఁడు, ఆప్పడు విూగు మి" దేశమును సౌఖ్య వంతము గాను సంతోషవంతముగాను నభ్యదయనంతముగాను జేయఁగలు గుదురు. ఇప్పడు మనయాంధ్రదేశము మేలుకొని కన్నులు తెఱచి మాంద్యమును వూని చుఱుకుఁదనమునుపూని దేశాభివృద్ధికరములైన నానా క్షేత్రములయందు మహోత్సాహముతో కృషిచేయుచున్నందుకు నేనెంతయు సంతోషమెందు చున్నాను, ఇది మన దేశముయొక్క పురోవృద్ధికి శుభసూచకముగా నున్నది. ఇటువంటిస్థితి మనమాతృభూమికి కలుగఁగాఁ జూడవలెనని నేను ముప్పదినలు