పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3 υτΟ స్వీయ చ రి త్రు ము మూలమున కుంటివాండు గ్రుడ్డివాండు వృద్ధులు మొదలయిన బీదల కన్న ప్రదానము చేయుటలో నెంతో పాటుపడుచుండెది. అంతేకాక తాను తోట విడిచి యూరిలోనికి పోవునప్పడు గాని గ్రామాంతరమునకు పోవునప్పడు గాని తప్పక బ్బులను మూట కట్టుకొనిపోయి బా8లో కనఁ్పడిన వికలాం గులకు దానము చేయుచుండెడిది. ఆమెకు సోమరితన మన్న తల కంటగించును. ఆమె సదా యేదో* యుపయుక్త మయిన పనిని చేయుచు కాలము నించు కేనియు వ్యర్థముగా क्षे-6 నీయక సత్కాల క్షేపమున సార్థక పఱుచుచుండెను. ఆమెకు గృహకృత్య నిర్వ ప-ణమునందును పాకరచనమునందును నిరుపమానమైన సామర్థ ముండెను. పరులకు పెట్టుట యన్న నామెకు పరమసంతోషమే యయినను రాగి కానైనను వ్యర్థముగా పోవుటకుమాత్ర మిష్టము లేనిదయి యుండెను ఆమె తెల్లవాఱు జావున లేచినది మొదలుకొని గృహకృత్యనిర్వహణాదులయందు విరామము లేక పాటుపడుచు తీతికయైనప్ప డెల్లనేదో వ్రాయుచుండుటలోను చదువు చుండుటలోను కాలముగడపుచుండెను. తాను చేయవలసిన కృత్యములలో నెల్ల -నా సంరకణము లేనకు ప్రథమకర్తవ్యముగా భావించి నన్ను పసిబిడ్డను పెంచి నట్టు పెంచుచుండె డెడిది. నేనేవుంచిపనికిఁబూనినను నాకు సహాయురాలయి యుండి సమస్త విషయములలోను ఛాయవలెనన్ననుసరించుచుసహధ రచారిణి యని పిలువఁబడుటకు సర్వవిధములనర్హురాలయి యుండెను. వితంతువివాహ ప్రయత్నమువలన నేను జాతిబహిష్కృతుఁడనయినను బ్రష్టమతానుష్టానపరుఁడ నయి యజ్ఞోపవీత విసర్జనము చేయుటవలనకొ ు. నూతనకష్టములకు పాత్రుఁడ నయినను నన్ను నిరుత్సాహపఱుపక హృదయ పూర్వక ము"గా నన్ననువ _ర్తించు చుండెను. నాకుఁగల యల్పద్రవ్యము నంతను నేను హిత కారిణీ సమాజమున కిచ్చివేసినప్పడు కోTంద eeసూయాపరులయిన కలహప్రియలునాభార్యయొద్దకు పోయి యా మెదురవస్థకు పరితపించుచున్నవారి వలె దుఃఖము నభినయించుచు దీనముఖములతో* ** అయ్యో! నీభర్త నీ జీవనమునకైనను లేకుండ సమస్తమును పరులపాలు చేయుచున్నాఁడు. ఆయనతో నీవు చెప్పి కాపురముండుట కొక