పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నా లు గ శ ప్రు కరణ ము 3 2 3 చ్చును. ఆయినను దీని సత్యాసత్యములను సదా యూమెతో చెలిమి సలిపిన సఖులే నిర్ణ యింపఁ దగినవారు, తనవారు నాకిచ్చి వివాహము చేసిన దోషముచేత నామూలమున నాభార్య యెన్నియో కష్టములకు లోఁబడవలసిన దయ్యెను. అయినను నా భార్యమాత్రము తా నా కష్టములను కష్టములను గా భౌవింపక తన్నుధన్యు రాలినిగాఁ జేయుటకయ యీశ్వరుఁడు పంపిన యనుగ్రహములను గా నెంచి ☆3で5で సంతుష్టాంతరంగురాలయి నవ్వు మొగముతో వానిని సహించుచుండెను. నేను వితంతువివాహ ప్రయత్నము నారంభించినప్పటినుండియు నా భార్యకు కష్టము లారంభ మయినవి. నే నుపన్యాసము లియ్య నారంభించినప్పడే సాధారణముగా నాంధ్రదేశమునం దంతటను ముఖ్యముగా రాజమహేంద్ర వరవునందును సంక్షోభ వూరంభ మయ్యెను, నేను సరిగా వివాహములు ఛెయఁ బూనినప్పు డాసంక్షోభము శతగుణములు సహ సగుణము లధిక మయ్యెను. నాబంధువులును మిత్రులును పురజనులును పూర్వాచార ప-రా యణులైన పండితులును తా మకార్యకిరణ మనుకొన్న యీ కార్యమునుండి నన్ను మరలింప సర్వవిధములఁ బ్రయత్నించి చూచి దారి గానక కడపటి dదుపాయము"గా నా భార్యను పట్టుకొ ని8. "కానీ యక్కడను కార్యసాఫల్య ము గలుగ లేదు. తన్ను పెంచి పెద్దదానిని జేసి విద్యాబుద్ధులు చెప్పించిన మేనమామయ బంధువులును వచ్చి యేదో ఘాశరవిపత్తు సంభవించినట్టుగా నేడ్చుచు నీ భర్త నీకార్యమునుండి మరలింపు మని నేను లేని సమయమున గా భార్యను నముగా వేడికొనిరి. రాతిగుండెను సహితము కరగించెడి యూ గీనాలాపములకు సంచలింపక పర్వతమువలె నిలిచి, “ఆయన పూనినది మంచి కార్య మని నేనును నమ్లు చున్నదాన నగుటచేత నే నాయనతోవల దని చెప్పిక పోవుటయే కాక యెన్ని కష్టములు వచ్చినను నే నాయనను విడు :వక తోడ్పడియెద” నని దృఢముగాఁ జెప్పెను. అప్పు డందఱును జేరి మమ్లం దఱను విడిచిపెట్టెదవాయని యేడ్వఁజొచ్చిరి. నేను మిమ్లెప్పుడును విడు వను, విూరే నన్ను విడిచెద రేమో యని యామె ప్రత్యుత్తరమిచ్చెను.