పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

స్వీయ చరిత్రము.


ధించిన సమస్త విషయములయందును యధాపూర్వముగా శ్రద్ధవహించుచునే యుండిరి. వితంతువివాహలత కవలంబస్తంభమని చెప్పఁదగిన పైడా రామకృష్ణయ్యగారే వితంతువివాహ పక్షమును విడిచిపెట్టి ప్రాయశ్చిత్తము చేయించుకొనఁబోవుచున్నారని యొక ప్రబలప్రవాద మెల్ల యెడలను వ్యాపించెను. అట్టివైపరీత్యము కలుగకుండుటకయి నేను సర్వవిథములఁ బ్రయత్నము చేసితిని. ఈవిషయమునుగూర్చి మాకత్యంతసహాయులయి కాకినాడ యనుగత న్యాయాధిపతి (Sub Judge) గా నుండిన కృష్ణస్వామిరావు పంతులుగారి పేరవ్రాయఁగా వారిట్లు ప్రత్యుత్తరమిచ్చిరి -

"కాకినాడ - 21-8-82.

మీయుత్తరము నాకంది నేను దానిని పై-రా-కృ గారికి చూపితిని. ఆయన మీకు రు. 100 లు పంపినట్టును ఇంకను కొంత యొకటిరెండు దినములలో పంపునట్టును చెప్పిరి. శ్రీరాములువిషయమై తగిన శ్రద్ధ పుచ్చుకొనఁబడును

పైడా రామకృష్ణయ్యగారు ఆచార్యునియొక్క యధికారమునకు లోఁబడుటకయి తనమనస్సును దృఢముచేసికొన్నాఁడు విధింపఁబడునట్టియు, నంగీకరింపఁ బడినట్టియు షరతులు మీరు పైనివేసికొన్న యుత్తమకార్యమున కత్యంత హానికరములైనవిగానున్నవి. వితంతు వివాహనిధికొఱకు జనులకు విన్నపము పంపుటకయి మీకాలోచన చెప్పుచున్నాను. ఆవిన్న పమన్ని పత్రికలయందును ప్రకటింపఁబడవలెను. మీచేవ్రాలు చేయఁబడిన విన్నపము యొక్క ప్రతినొకదానిని మీరు నాకు పంపినయెడల నేను దానిని హిందూపత్రికకుపంపి దానిని తనవ్రాతతో బలపఱుచుచు ప్రకటింపుమని పత్రికాధిపతిని గోరెదను. సొమ్ముపోగుచేయుటకయి ప్రయత్నము చేయవలసినదనియు, పైడా రామకృష్ణయ్యగారింతవఱకును జేసినట్టుగా ముందంత సాహాయ్యమును చేయఁజాలరు గనుక లేకపోయిన యెడల కార్యమునకు భంగముకలుగుననియు నేను చెంచలరావుగారికి వ్రాసియున్నాను. ఆయన కొంతపని చేయునని నమ్ము