పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/93

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వ్రాస్తూ " మీ రచనా శైలి పల్లె ప్రజలతో మాట్లాడినట్లుండాలి. విద్యావంతులతో మాట్లాడిన రీతిగా క్లిష్టంగా వుండరాదు. కఠిన పదాలను, సంస్కృత పదాలను వాడకండి " అనేవారు.

తిలక్ ' ఒరాయన్ ', ఆర్కిటిక్ హోం ఇన్ ది వేదాస్ ' 'గీతా రహస్య ' అను ఉద్గ్రంథాలను వ్రాశాడు.

తనకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేసిన మానవతావాది తిలక్. ' జ్ఞాన ప్రకాశ ' అను పత్రిక ' కేసరి ' పత్రికకు బద్ధ విరోధి. రెండు పత్రికలూ ఒకే ప్రెస్ లో ముద్రితమవుతుండేవి.

ఒకమారు అనివార్య పరిస్థితులలో ' జ్ఞానప్రకాశ్ ' మేనేజర్ తిలక్ గారి వద్దకు వచ్చి ' అయ్యా ఈనాడు మా పత్రికలో సంపాదకీయం వ్రాసేవారెవరూ లేరు. దయచేసి మీరు వ్రాసిస్తారా ' అని కోరాడు తిలక్ సమ్మతించి వ్రాసివచ్చాడు. విభిన్న ధోరణలు గల పత్రికలు అవి. కాని మరుసటి రోజున ఆయా పత్రికల ధ్యేయానికి అనుగుణంగా సంపాదకీయాలు వ్రాయబడినాయి !

హిందూ-ముస్లిమ్‌ తగాదాలు తలయెత్తినపుడు ' కేసరి ' పత్రికలో ఇలా వ్రాశారు. "భారతదేశంలో హిందువులు, ముస్లిములు శతాబ్దాలుగా సమైక్య భావంతో మెలుగు తున్నారు. వారి హక్కులు ఏనాడో నిర్ణయింపబడినాయి. ప్రభుత్వం పక్షపాత ధోరణిని అవలంబించటం వల్ల వైమనస్యాలు తలయెత్తుతున్నాయి. ఈ తగాదాలన్నిటికీ ప్రభుత్వమే కారణం" అన్నారు.

భాతరజాతిని స్వాతంత్ర్య సమరోత్సాహంతో జాగృతమొనర్చిన మహానేత లోకమాన్య బాల గంగాధర తిలక్.