పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బళ్ళారి రాఘవ 1880 ఆగస్టు 2 వ తేదీన తాడిపత్రిలో జన్మించాడు. తండ్రి నరసింహాచార్యులుగారు బళ్ళారి మునిసిపల్ హైస్కూలులో తెలుగు పండితులు. మేనమామ ఆంధ్ర నాటక పితామహ ధర్మవరం రామకృష్ణమాచార్యులుగారు బళ్ళారిలో న్యాయవాదిగా వుండేవారు.

బళ్ళారి మునిసిపల్ హైస్కూలునుండి మెట్రిక్యులేషన్ పరీక్ష పాసైన రాఘవ మద్రాసులో పట్టభద్రులయ్యారు. బాల్యం నుండి నాటకాలంటే ఎంతో ఆసక్తికల రాఘవ మద్రాసులో, పెక్కు ఇంగ్లీషు నాటకాల్లో పాల్గొన్నాడు. ప్రముఖ ఆంగ్లనటుల మెప్పులందుకున్నాడు. మద్రాసులో బి.యల్. పరీక్ష పాసయ్యాడు.

మద్రాసు నుండి వచ్చిన తర్వాత మేనమామ వద్ద జూనియ‍ర్‍గా వుంటూ నాటకాల్లో అభినయించేవాడు. ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారి సరసవినోదినీ సభలోనూ, కోలాచలంవారి సుమనోరమ సభలోను అభినయించేవాడు. ఈ సమాజాలు బళ్ళారిలోనే కాక మద్రాసు, హైదరాబాదు, విజయవాడ,బెంగుళూరు నగరాల్లో ప్రదర్శనలిస్తుండేవి.

రాఘవకు పౌరాణిక నాటకాలకంటే చారిత్రక, సాంఘిక నాటకాలపట్ల ఎక్కువ అభిరుచి వుండేది.

కోలాచలం వారు రచించిన 'విజయనగర పతనము'లో రాఘవ పఠాన్ రుస్తుం అభినయం అత్యద్భుతంగా వుండేది. ఈ నాటక ప్రదర్శనవల్ల హిందూ ముస్లిమ్ సఖ్యతకు భంగం కలుగుతుందన్న అనుమానంతో మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శనను నిషేధించింది.

చాణక్య పాత్రధారిగా రాఘవ మహానటుడని ప్రశంసింపబడ్డాడు. నవరసాలు ఒకటి తర్వాత ఒకటి తరుముకొని వస్తున్నాయా అనిపించేదాయన నటనలో.

రామదాసు పాత్రలో భక్తిభావాన్ని చాలాగొప్పగా చూపేవాడాయన. నాటకంలో స్వయంగా కొన్ని సన్నివేశాలను కల్పించి ప్రదర్శించేవారు. రచనలో కూడా సమయానుకూలంగా మార్పులు చేసేవారు.

తానీషా, రాముణ్ణి నాకు కూడా చూపీంచమని రామదాసును నిర్బంధిస్తాడు. అపుడు రామదాసు, "పిచ్చివాడా, ఎవరి రాముడు వారిలో వుంటాడు - దేవుడొక్కడే. భక్తుల విశ్వాసాలకు తగినట్లు రూపం ధరిస్తాడు. రామ్-రహీమ్, క్రీస్తు, బుద్ధుడు-ఇవన్నీ ఆయన రూపాలు" అంటు మతసామరస్యాన్ని ప్రదర్శించేవారు.

జాతీయోద్యమం ముమ్మరంగా సాగుతున్న కాలమది. రామదాసు జైలులో వుంటూ 'ఆత్మసిద్ధి పొందడానికి కారాగృహవాసమే ప్రథమ సోపానం' అంటాడు.

తానీషా ఆదేశం మేరకు భటులు రామదాసును జైలుకు తీసుకొని వెళ్ళారు. వెళ్ళేముందు భార్య కమలాంబ భర్త నుదుట కుంకుమ పెడుతుంది. ఖద్దరు శాలువా కప్పి, తెల్లని టోపీ అతని తలపై పెట్టి హారతి యిస్తుంది. ఆ కాలంలో గాంధీటోపీ

2