Jump to content

పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాంతం ఆ సమాఖ్య అధ్యక్షులుగా పనిచేశారు. 1922 లో అఖిలపక్ష రాజకీయ సమ్మేళనానికి, 1923లో ఇండియన్ సైన్స్ కాంగ్రెసుకు అధ్యక్షత వహించారు.

విశ్వేశ్వరయ్య స్వదేశీ సంస్థాన ప్రజలు బ్రిటిష్ ఇండియాలోని ప్రజలకంటే ఎక్కువ బాధలు పడుతున్నారని గ్రహించి వారి స్వేచ్ఛకోసం గొప్ప కృషి చేశారు. మైసూరు సంస్థానంలో ప్రజాప్రతినిధి సభను ప్రారంభించారు.

కర్తవ్య నిర్వహణలో, నిజాయితీలో అటువంటి వారు అరుదు. దివాన్ పదవి స్వీకరించే ముందు బంధుమిత్రులను ఆహ్వానించారు. " నేను దివాన్ పదవిలో వుండగా ఎటువంటి ఉద్యోగాలు కోరమని, సిఫార్సులు చేయమని వాగ్ధానం చేయమన్నారు." తన బంధువులను ప్రభుత్వోద్యోగాల నుండి తప్పించి, ఇతర వృత్తులను చేపట్టుటకు సొంతపైకం యిచ్చారు.

మైసూరు సంస్థానంలో మోటార్ కార్ల నిర్మాణం ప్రారంభించాలనుకున్నారు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం తిరస్కరించింది. రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. ఇండియాలో విమాన నిర్మాణం అత్యవసరమైనది. విశ్వేశ్వరయ్య గారి సలహా మేరకు బెంగుళూరులో భారత ప్రభుత్వం విమాన కార్ఖానా నెలకొల్పింది. విశాఖ పట్నంలోని నౌకా నిర్మాణ పధకాన్ని రూపొందించి వాల్ చంద్ హీరాచంద్ గారిచే ప్రారంభింపచేసిన వారాయనే.

గాంధీజీ - విశ్వేశ్వరయ్యగారులు దేశాభివృద్ధి సాధనలో భిన్న దృక్పధాలు కలవారు. గాంధీజీ గ్రామీణ పరిశ్రమలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. విశ్వేశ్వరయ్యగారు భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చి కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహించాలన్నారు.

" నా అభిప్రాయాలు ఎలా ఉన్నా, మీ సహకారం లభించే అదృష్టానికి నోచుకున్నందుకు సంతోషిస్తున్నాను. నా అభిప్రాయాలను వ్యతిరేకించినా మీ దేశ భక్తి, శక్తిసామర్ధ్యాల పట్ల నాకున్న గౌరవం ఏనాటికీ తరగదు." అన్నారు గాంధీజీ.

"మీరేమైనా చెప్పండి. భారత గ్రామీణుల గురించి నాకు మీకంటే ఎక్కువగా తెలుసు" అని గాంధీజీ అన్నప్పుడు, "నేను మీకంటే పదేళ్ళు పెద్దవాడినన్న విషయం గమనించ మనవి. దేశ ఆర్ధిక ప్రగతి విషయంలో మీ కంటే ఎక్కువ అవగాహన నాకుంది " అంటూ బదులు వ్రాశారు విశ్వేశ్వరయ్యగారు, గాంధీజీకి వ్రాసిన జాబులో.

భారతదేశంలోని పెద్ద జలాశయాలు, ఆనకట్టలు నిర్మించుటలో వారి సలహాలను ప్రభుత్వం గొప్పగా భావించేది.

తొంభై ఏళ్ళ వయసులో ప్రధాని నెహ్రూ ఆహ్వానాన్ని మన్నించి పాట్నా వద్ద గంగానదిపై వంతెన నిర్మాణ పథకాన్ని, కొందరు ఇంజనీర్ల బృందంతో రూపొందించారు. తుంగభద్ర ప్రాజెక్టు పథక శిల్పి వారే.

విశ్వేశ్వరయ్య నిజాయితీకి సాకారం. ఒక మారు విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. కొంత పైకం కావాల్సి వచ్చింది. మైసూరు బ్యాంక్ మేనేజర్ బి. వి. నారాయణరెడ్డి గారికి ముందుగా ఫోన్ చేసి, బ్యాంక్ కు వెళ్ళారు. మేనేజర్ వారినెంతో గౌరవంగా లోపలికి తీసుకెళ్ళారు. అన్ని దరఖాస్తులు సిద్ధమైనాయి. విశ్వేశ్వరయ్య తమ వద్దవున్న