భారతరత్న అవార్డు పొందిన భారత రాజ్యాంగశిల్పి
డా. భీమ్‌రావ్ అంబేద్కర్
భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘసంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ స్మృతికి నివాళులర్పిస్తూ, ఆ మహనీయునికి ' భారతరత్న ' అవార్డును భారత ప్రభుత్వం యివ్వడం అత్యంత అభినందనీయం.
బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురియై, బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషితో, స్వీయప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్రమంత్రి పదవిని అలంకరించిన మహామనీషి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్.
లోకమాన్య బాలగంగాధర తిలక్, మహర్షి కార్వే వంటి అగ్రనాయకులు జన్మించిన మహారాష్ట్రంలోని రత్నగిరి జిల్లాలో, మందన్‌గాడ్ పట్టణానికి దగ్గరున్న అంబావాడే గ్రామంలో మెహర్ కులానికి చెందిన, రాంజీ సక్‌పాల్, భీమాబాయి దంపతుల 14వ సంతానంగా జన్మించిన వాడు అంబేద్కర్. జననం 1891 ఏప్రిల్ 14న. భీమ్‌రావ్ ను తండ్రి చాలా క్రమశిక్షణతో పెంచాడు. బాల భీమ్‌రావ్ ప్రతిదినం రామాయణ, భారత, తుకారం, మోరోపంత్ ల భజన గీతాలు గానం చేసేవారు. ఆ కుటుంబం శాకాహారం మాత్రమే సేవించేది.
మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించిన కాలమది. వేసవిసెలవుల్లో మామగారున్న