Jump to content

పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాళంగా రు. 3-20 లక్షలు, ప్రభుత్వం నుండి రు.4-50 లక్షలు ఖర్చు చేసి విశాలమైన గ్రంథాలయ భవనం నిర్మింపబడింది. శ్రీ పోలేపల్లి వెంగన్న శ్రేష్టి తమ సొంత గ్రంథాలయంలోని మూడువేల పుస్తకాలు. డా. పుట్టపర్తి వారు వంద విలువైన పుస్తకాలు యీ గ్రంథాలయానికి యిచ్చారు. ఈ గ్రంథాలయానికి ఇచ్చే విరాళాలపై ఆదాయపు పన్ను రాయితీ ఇవ్వబడుతుంది. తి.తి.దేవస్థానం, తెలుగు అకాడమి, తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆచార్య చల్లా రాధాకృష్ణ శర్మ, డా. బెజవాడ గోపాలరెడ్డి, డా.కె. జగ్గయ్య మున్నగువారు పెక్కు గ్రంథాలను ఇచ్చారు. ఇప్పుడు ఈ గ్రంథాలయంలో 11 వేల గ్రంథాలున్నాయి.

తెలుగు భాషా సాహిత్యాల సముద్ధరణ కోసం నిర్విరామంగా కృషి చేసిన సి.పి.బ్రౌన్ 1854లో పదవీ విరమణ చేసి లండన్‌లో స్థిరపడ్డారు. లండన్ యుూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్ గా కొంతకాలం పనిచేసి 1884 డిసెంబర్ 12న ఎనభై ఏడవ ఏట కన్ను మూశాడు.

క॥నూరార్లు లెక్క సేయక
పేర్లందిన విబుధ జనుల బిలిపించుచు వే
మార్లర్థ మిచ్చు వితరిణి
చార్లేసు ఫిలిప్స్ బ్రౌన్ సాహెబు కరుణన్

అని నివాళులందుకున్నాడు.