చ. | అన విని యమ్మహీరమణుఁ డాతని కిట్లను మీకు నాకతం | 362 |
ఇటువలెనే (ఇంకను) తెలుసుకొనేది.363
అందఱు – అందొఱు, ఒకటి-ఒకొటి, ఈ రెండు నప్పకవిగారును, కంటిపొరలు-పరలు, పొదమా-పదమా- ఈ రెండును తిమ్మకవి సార్వభౌముడు వ్రాసినారు. తలగుట-తొలగుట; నేల పొరలుట - పరలుట,- ఇవియును గలవు.364
సీ.పా. | నిద్రిత ద్రుచ్ఛాయ నిలువర జరుగు వెం | 365 |
వ్యాఖ్యయందు ‘పొరలు వెట్టు' అను (దానికి) అర్థము వ్రాసినారు. యతిభంగము కానలేదు. మిగిలినవి (పదములకు లక్ష్యములు) సులభము.366
తద్భవ సకారముకు-కొన్నింట తలకట్టు, కొన్నింట నేత్వము (గలదు.) 'శయ్యకు'కు రెండును (ఉన్నవి.) శంఖమునకు 'సంకు', శాణముకు 'సాన', శణక - సెలగ, శక్తి-సత్తి, శల్యుడు- సెల్లుడు, శపియించుట - సెపియించుట, శయ్య-సజ్జ, సెజ్జ, శణగ శబ్దముకు జనుము.367
గీ. | సెల్లుఁ డట్లు నేలఁ ద్రెళ్లి చెచ్చెర లేచి | 368 |
(ఈ పద్యమందు) 'సెల్లుఁడ'ని యెఱుగక-'శల్యుఁ డట్లు నేల చతికిలఁబడి' అని వ్రాసినారు.369