ఈ పుట అచ్చుదిద్దబడ్డది
సుకవి మనోరంజనము
పంచమాశ్వాసము
| శ్రీ భారతీశ సన్నుత | 1 |
(అవధరింపుము) అప్పకవిగారి ఆక్షేపణలు—
[2]మహాకవి ప్రయోగములు గల యతిప్రాసములు కొన్ని కొట్టివేయడమున్ను, కొన్ని దిద్దడమున్ను, ఒకటియు మహాకవి ప్రయోగములు లేని యతిప్రాసములు నిలుపుటయు (మొదలగునవి అప్పకవిగారు చేసినవి వివరముగా వ్రాసినాము. ఇవి యిట్లుండగా-)
| 'డోలా భూషోత్తరీయాణి వినైత్వం నాస్తి మధ్యయె' | |
అను అథర్వణ కారికను తెనిగించిన ముద్దరాజు రామన్నగారి నాక్షేపించి, పయ్యెద - ఉయ్యెల- తాయెతులకు యకారమున కేత్వము లేదనుటయు, ఒకపదముంటే అర్థము కుదురదని (మరి) యొకపదముగా నిర్ణయించి పొసగని లక్ష్యములు వ్రాసుటయు- ఈ మొదలైనవి (అప్పకవిగారి వ్రాతలు) అనేకములు గలవు.2