ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| కపి దైత్య వీరశేఖరు లశ్వఘోషలు | |
ఈ పద్యమందు రేఫ ఱకార సాంకర్యమేకాదు. 'ముష్టీముష్టి' యని యుండవలసినందుకు 'ముష్టాముష్టి' యని యతి యందు ప్రయోగించినారు. 189
వ్యాకరణసూత్రము
| 'కర్మవ్యవహారే బహువ్రీహౌ పూర్వపదాంతస్య దీర్ఘః | |
అని యున్నందున 'ముష్టాముష్టి' యనరాదు. అకారాంతములకు-దండాదండి. ఇకారాంతములకు - 'ముష్టీముష్టి.' ఉకారాంతములకు - ‘బాహాబాహవి’ అని వ్యాకరణమందే యున్నది. 'బాహాబాహి' అనుచోట 'బాహా' శబ్దము - అకారాంత స్త్రీ లింగము - కలదు. కావున 'బాహాబాహి'యని పూర్వపదాంతముకే దీర్ఘము. కాని, 'ముష్టి' శబ్దము అకారాంతముగా కన్పించదు. ఇక,— 190