ఈ పుట అచ్చుదిద్దబడ్డది
(అని రేఫ ఱకారములను కలిపినారు). ఇటువలెనే మహాకవులకున్ను రేఫ ఱకారాలపట్ల పరిశీలన లేకపోయినది" అని వ్రాసినారు. 178
లాక్షణికులు నిర్దోషమైన భాగవతము నాక్షేపించిరి. రేఫ ఱకార సాంకర్యముగల (మనుచరిత్ర) ఆముక్తమాల్యాది కావ్యముల నాక్షేపించరయిరి. అయితే అది పరిశీలించి, తప్పులున్నచోట తప్పులనుట తిమ్మకవి సార్వభౌమునికి తప్పా. పామరులు 'అప్పకవీయమునందు తప్పులున్న' వన్నా మని మము నాడుదురు. చెప్పకమానితే, తప్పులే ఒప్పులగును. 179
రేఫ సాంకర్యములు మరియును గలవు.
చేమకూరవారి విజయవిలాసము (1-28) —
ఉ. | కోప మొకింత లేదు బుధకోటికిఁ గొంగుపసిండి సత్య మా | 180 |
అందే (2-40) —
సీ. పా. | తన పితామహుని బృందారకాధిపుఁ బోలు | 181 |
చేమకూరవారి సారంగధరచరిత్ర (2-180) —
క. | వ్రతమా యిటు లేచ మధు | 182 |
అందే (3-252) —
క. | మఱుపింపఁదగునె నృపతికి | 183 |