అచ్చుకు —
విరాటపర్వము (2-84) —
ఉ. |
చిత్తము మెచ్చినా వలనఁ జిక్కఁగ వెండియు నాలతాంగి య
చ్చొత్తిన యట్లు నాకుఁ దన యుల్లముఁ దెల్లము చేయకున్కిఁదా
నత్తరిఁ క్రొత్త కాన్పగుట నడ్డము సొచ్చిన సిగ్గుపెంపు న
న్నుత్తల మందఁ జేయుటకునో తల పోసి యెఱుంగ నయ్యెదన్.
| 526
|
శ్రీనాథుని నైషధము (4-65) —
చ. |
హరి హయుఁ డేమి యయ్యెనొకదా మదనానలతాపవేదనన్
(వరుణుఁడు విప్రయోగమున వాడఁడె యింతకు, దండపాణి తా
విరహభరంబున న్మిగుల వేగఁడె, నొవ్వఁడె వీతిహోత్రుఁడున్
బరిసరకేళికాననసమాగతమందసమీరణంబులన్).
| 527
|
చేమకూరవారి సారంగధరచరిత్రము (2-68) —
ఉ. |
పాయక మోహతాపమున భామిని యుండఁగ నందు మీఁద నేఁ
డీ యెడ హానివచ్చునని యెంచక యూరక పిట్టరేపు నే
యీయన రేచ వచ్చునొకొ యిచ్చనె వచ్చెనొ యమ్మచెల్ల యే
నో యిది కారణం బనుచు నూహలు సేయుచుఁ బ్రోడచేడియన్.
| 528
|
శ్రీనాథుని కాశీఖండము (4-191) —
సీ. |
ప్రతిబింబమోకాని రజనివల్లభున క
ధ్యాహారమోకాని యమృతరుచికి
వినిమయంబోకాని వధున కన్యాదేశ
మోకాని యత్రి నేత్రోద్భవునకు
వీప్సయోకాని పూవిలుకాని సఖునకు
నామ్రేడితమొ కాని యబ్ధిజునకు
నభిధాంతరమొకాని యరవిందవైరికి
సారూప్యమోకాని చందురునకు
|
|